‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్ ఇదే అంటే అతిశయోక్తి కాదు. మామూలుగా వెబ్ సిరీస్‌లు ఎక్కువగా యూత్ చూస్తుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని అవి పెద్దగా ఆకర్షించలేదు. ఇందుక్కారణం వెబ్ సిరీస్‌లు ఎక్కువగా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కడం, బోల్డ్‌నెస్ ఎక్కువ ఉండటం. ఐతే ‘ఫ్యామిలీ మ్యాన్’ మాత్రం ఇందుకు మినహాయింపు. అది అందరూ చూసి ఎంజాయ్ చేసేలా నీట్‌గా ఉంటుంది.
పైగా ఫ్యామిలీ డ్రామా కూడా అందులో హైలైట్. అందుకే ఈ సిరీస్‌కు ఎక్కువ ఆదరణ లభించింది. ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయ్యాక రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురు చూశారు. వారి నిరీక్షణకు తెరదించుతూ 2021 జూన్‌లో సెకండ్ సీజన్‌ను రిలీజ్ చేసింది అమేజాన్ ప్రైమ్. అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉన్న సెకండ్ సీజన్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక అప్పట్నుంచి ఫ్యామిలీ మ్యాన్-3 కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
ఫ్యామిలీ మ్యాన్-2 చివర్లో మూడో సీజన్ గురించి హింట్ ఇచ్చిన మేకర్స్.. ఇప్పటిదాకా దాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లలేదు. ఈ సిరీస్ క్రియేటర్స్ రాజ్-డీకేల నుంచి ఆల్రెడీ ఫర్జీ వచ్చింది. త్వరలోనే గన్స్ అండ్ గులాబ్స్ రాబోతోంది. దాని తర్వాత సిటాడెల్ లైన్లో ఉంది. మరోవైపు ఫర్జీ-2 సైతం ప్లానింగ్‌లో ఉంది. గన్స్ అండ్ గులాబ్స్ ప్రమోషన్లలో భాగంగా రాజ్-డీకే మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ మ్యాన్-3 గురించి అప్‌డేట్ ఇచ్చారు.
సిటాడెల్ పూర్తి కావస్తోందని.. అది అవ్వగానే, ఈ ఏడాది చివర్లో ఫ్యామిలీ మ్యాన్-3 మొదలుపెడతామని రాజ్-డీకే వెల్లడించారు. ఫర్జీ రెండో సీజన్ ఇప్పుడే ఉండదని.. ఫ్యామిలీ మ్యాన్-3 తర్వాత దాని సంగతి చూస్తామని ప్రకటించారు. ఫ్యామిలీ మ్యాన్-3 ఇండియా మీద చైనా ఎటాక్ చేసే బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుందని రెండో సీజన్ చివర్లోనే హింట్ ఇచ్చారు. లీడ్ రోల్‌ను మనోజ్ బాజ్‌పేయే చేయబోతున్నాడు.
This post was last modified on August 16, 2023 1:29 pm
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…
హార్రర్ సినిమాల్లో దయ్యాల పాత్రలు పోషించిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఒకప్పుడంటే దయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ…