మెగాస్టార్ చిరంజీవి నుంచి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన సినిమా ‘భోళా శంకర్’. ఈ చిత్రంపై ముందు నుంచి అంచనాలు తక్కువే అయినప్పటికీ.. ఎంతైనా చిరంజీవి సినిమా కాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్నయినా అందుకుంటుందని అనుకున్నారు. కానీ సామాన్య ప్రేక్షకులతో పాటు మెగా ఫ్యాన్స్ సైతం ఈ సినిమాను తిరస్కరించడంతో చేదు అనుభవం తప్పలేదు.
‘ఆచార్య’ కంటే దారుణంగా బోల్తా కొట్టిన ఈ చిత్రం చిరు కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలవబోతోందని స్పష్టమైపోయింది. ఫుల్ రన్లో రూ.25 కోట్ల షేర్ కూడా వచ్చే పరిస్థితి లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇండిపెండెన్స్ డే సెలవుతో ఈ సినిమా రన్ ముగిసినట్లే. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను పట్టించుకోవడం మానేశారు. ఐతే ఈ చిత్రం త్వరలోనే హిందీలో రిలీజ్ కాబోతుండటం విశేషం. ఆగస్టు 25కు రిలీజ్ డేట్ కూడా ఖరారైంది.
‘భోళా శంకర్’ను అదే పేరుతో 25న నార్త్ ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ట్రైలర్ కూడా బయటికి వచ్చింది. చిరంజీవికి హిందీలో సీనియర్ నటుడు జాకీష్రాఫ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. తెలుగు వెర్షన్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలోనే హిందీ డబ్బింగ్ పనులు కూడా జరిగినట్లున్నాయి. ప్రస్తుతం గదర్-2, ఓఎంజీ-2 చిత్రాలతో గట్టి పోటీ ఉంది కాబట్టి రెండు వారాలు ఆలస్యంగా రిలీజ్ ప్లాన్ చేసినట్లున్నారు.
‘భోళా శంకర్’ హిందీ ట్రైలర్‌ను తెలుగు వాళ్లే షేర్ చేస్తూ దాని మీద కామెడీ చేస్తున్నారు. తెలుగులో ఇంత డిజాస్టర్ అయిన సినిమా హిందీలో మాత్రం ఏం ప్రభావం చూపుతుందని కౌంటర్లు వేస్తున్నారు. కాకపోతే ఈ సినిమాతో దారుణంగా నష్టపోయిన నిర్మాత అనిల్ సుంకరకు హిందీ నుంచి అంతో ఇంతో ఆదాయం వస్తుందేమో చూడాలి. ఐతే దీని ఒరిజినల్ ‘వేదాళం’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఆల్రెడీ చాలా ఏళ్ల నుంచి యూట్యూబ్‌లో అందుబాటులో ఉండటం గమనార్హం.
This post was last modified on August 16, 2023 11:19 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి…
ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక…
తండేల్ విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంత ఆలస్యం తర్వాత పలు డేట్లు మార్చుకుంటూ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన…
రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు…
వరస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ కొత్త సినిమా డాకు మహారాజ్ జనవరి 12 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటిదాకా…