పైడిపల్లి కథ ముగిసినట్టే!

మహేష్ తో తదుపరి చిత్రం ఖాయమని అనుకున్న మహర్షి దర్శకుడు వంశి పైడిపల్లికి సూపర్ స్టార్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సడన్ గా పరశురామ్ తో సినిమా ఓకే చేసుకున్న మహేష్ ఆ తర్వాత అయినా తనకి ఛాన్స్ ఇస్తాడని వంశి పైడిపల్లి ఆశించాడు. అందుకే తనతో మహేష్ సినిమా లేదని రాస్తున్న మీడియాపై ఫైర్ అయ్యాడు.

కానీ మహేష్ తో తన తదుపరి చిత్రం ఉంటుందని రాజమౌళి ప్రకటించడంతో ఇక వంశి పైడిపల్లి తన ‘మహర్షి’పై ఆశలు వదిలేసుకున్నాడు. ఇప్పుడు అదే కథ కోసం మరో స్టార్ హీరోని వెతికే పనిలో పడ్డాడు. ఎవడు చేసిన చరణ్ తో తనకి మంచి రిలేషన్ ఉండడంతో చరణ్ ఛాన్స్ ఇస్తాడని ఆశిస్తున్నాడు.

చరణ్ ఆర్.ఆర్.ఆర్. కాకుండా ఇంకా వేరే సినిమా ఏదీ కమిట్ అవలేదు.. ఆచార్యలో చేసే స్పెషల్ క్యారెక్టర్ తప్ప. కాబట్టి చరణ్ ని ఒప్పించగలిగితే బాగుంటుందని ట్రై చేస్తున్నాడు. అయితే ఆర్.ఆర్.ఆర్. తర్వాత చేసే చిత్రానికి మరింత స్టార్ వేల్యూ ఉన్న దర్శకుడి కోసం చరణ్ ప్రయత్నించే అవకాశం లేకపోలేదు.