ఇంకో పదిహేను రోజుల్లో విడుదల కాబోతున్న ఖుషి మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత రౌడీ హీరో చేస్తున్న మూవీ అయినప్పటికీ దాని ప్రభావం ఏ మాత్రం పడకుండా చేస్తున్న ప్రమోషన్లు బిజినెస్ పరంగానూ క్రేజ్ తెచ్చి పెడుతున్నాయి. ఇండిపెండెన్స్ రోజు హైదరాబాద్ లో జరిగిన లైవ్ మ్యూజికల్ కన్సర్ట్ ఒక్కసారిగా హైప్ లో కొత్త వైబ్రేషన్స్ లో తీసుకొచ్చింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ – సామ్ లు స్టేజి మీద ప్రత్యక్షంగా ఇచ్చిన ప్రదర్శన ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఇద్దరూ లైవ్ ఇస్తారని ముందే తెలిసినా ఈ మూమెంట్స్ ఊహించలేదు.
సాంగ్స్ కి డాన్స్ చేస్తూ సమంతాని ఎత్తుకుని గాల్లో గిరగిరా అంటూ తిప్పడం, దానికన్నా ముందు చొక్కా విప్పేసి బనియన్ తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో రౌడీ బాయ్స్ అంటూ జోష్ నింపే ప్రయత్నం చేయడం బాగా పేలాయి. చాలా జోష్ తో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ జంట నర్తిస్తున్న తీరు తాలూకు వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలయ్యాయి. ఇటీవలే వచ్చిన ట్రైలర్ లో కథేంటో స్పష్టంగా చెప్పేయడంతో దర్శకుడు శివ నిర్వాణ అసలు సినిమాలో వాటిని పూర్తి స్థాయిలో ఎలా ఎంటర్ టైనింగ్ గా చూపిస్తాడనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంది.
ఈ నెలలో జైలర్ డామినేషన్ సెప్టెంబర్ 1కల్లా ముగింపుకొచ్చేస్తుంది. ఆగస్ట్ మూడు నాలుగు వారాల్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నప్పటికీ మరీ స్ట్రాంగ్ గా కాంపీట్ చేసేవి అంతగా లేవు. ఏదైనా ఎక్స్ ట్రాడినరి టాక్ వస్తే తప్ప నిలదొక్కుకోవడం కష్టం. ఇలాంటి పరిస్థితిలో వస్తున్న ఖుషికి భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. కథ, పాటలు, టేకింగ్ లో మణిరత్నం ముద్ర స్పష్టంగా చూపిస్తున్న శివ నిర్వాణ కంటెంట్ కూడా అదే స్థాయిలో రాసుకుని ఉంటే నిన్ను కోరి, మజిలీలని మించిన సక్సెస్ కొట్టొచ్చు. రాబోయే రెండు వారాలు మైత్రి మూవీ మేకర్స్ భారీ పబ్లిసిటీని ప్లాన్ చేసుకుంది.
This post was last modified on August 16, 2023 9:49 am
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్‌కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…