Movie News

టాలీవుడ్లో ‘రీమేక్’ ప్రకంపనలు

తెలుగులో ఎవరైనా స్టార్ హీరో రీమేక్ చేస్తున్నాడంటే చాలు.. అభిమానులు వద్దు మొర్రో అని గోల చేయడం మామూలు అయిపోయింది. ఎంత మార్పులు చేర్పులు చేసినా.. కొత్త ఆకర్షణలు జోడించినా సరే.. రీమేక్ అంటే ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ ఉండట్లేదు. ఇంటర్నెట్ విప్లవం.. ఓటీటీల హవా కారణంగా అందరూ అన్ని భాషల చిత్రాలూ చూసేస్తున్న రోజులివి. అందులోనూ ఒక భాషలో ఓ సినిమా హిట్టయింది అంటే చాలు.. ఆ లాంగ్వేజ్ రాకపోయినా సరే సబ్‌టైటిల్స్ పెట్టుకుని చూస్తున్నారు.

అవి అందుబాటులో లేకపోయినా చూడ్డానికి వెనుకాడట్లేదు. ఒక పాపులర్ సినిమా అంటే సినిమా చూసినా చూడకపోయినా ఆటోమేటిగ్గా సినిమాలోని విశేషాలన్నీ సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నాయి. అందువల్లే దాన్ని మరో భాషలో పునర్నిర్మిస్తుంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండట్లేదు. కథాకథనాలతో పాటు అన్ని విశేషాలూ బయటికి వచ్చేశాక ఇంక సినిమా చూడటంలో ఎగ్జైట్మెంట్ ఏముంటుంది?

ఐతే ప్రేక్షకుల ఆలోచనను, అభిరుచిని అర్థం చేసుకోకుండా కొందరు హీరోలు మాత్రం రీమేక్‌ల మీద రీమేక్‌లు తీసేస్తున్నారు. ముఖ్యంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా పోటీ పడి రీమేక్‌లు చేస్తున్నారు. ఈ సినిమాల విషయంలో ప్రేక్షకుల అనాసక్తి ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నా మెగా బ్రదర్స్ వెనక్కి తగ్గట్లేదు. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’.. వీటిలో దేనికీ పూర్తి సంతృప్తికర ఫలితం రాలేదు.

రెవెన్యూ సినిమా సినిమాకూ తగ్గుగూ వచ్చి ‘బ్రో’ అయితే డిజాస్టరే అయింది. ఇక చిరు విషయానికి వస్తే రీఎంట్రీ మూవీ కాబట్టి ‘ఖైదీ నంబర్ 150’ బాగానే ఆడింది. కానీ ‘గాడ్ ఫాదర్’ నిరాశపరిచింది. ‘భోళా శంకర్’ అయితే భారీ డిజాస్టర్ అయింది. బ్రో, భోళా శంకర్ సినిమాల విషయంలో మెగా అభిమానుల నుంచే తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఇక రీమేక్‌లు చాలించమని మెగా బ్రదర్స్‌కు అభిమానులు గట్టిగా సంకేతాలు ఇచ్చినట్లే కనిపించింది ట్రెండ్ చూస్తే.

ఇక సాధారణ ప్రేక్షకుల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. చిరు, పవన్ అనే కాదు.. ఏ హీరోలు అయినా రీమేక్‌ల జోలికి వెళ్తే డిజైరింగ్ రిజల్ట్ రాదనే హింట్స్ ప్రేక్షకులు ఇచ్చేశారు. ఫలక్‌నుమాదాస్, జాను, శేఖర్, ఇష్క్, బుట్టబొమ్మ..  ఇలా గత కొన్నేళ్లలో దారుణంగా దెబ్బ తిన్న రీమేక్‌ సినిమాల జాబితా పెద్దదే. అందుకే మొత్తం ఇండస్ట్రీలోనే రీమేక్‌ల గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on August 15, 2023 6:53 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

25 minutes ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

3 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

4 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

4 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

4 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

5 hours ago