చిన్న హాస్య నటుడిగా మొదలుపెట్టి స్టార్ కమెడియన్ గా ఎదిగి హీరోగా కొన్ని విజయాలు అందుకుని తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయిన సునీల్ కు గత రెండేళ్లుగా కెరీర్ మంచి స్పీడ్ మీదుంది. ఫలానా టైపు పాత్రలే చేస్తానని కండీషన్లు పెట్టకపోవడంతో భువన విజయం లాంటి చిన్నా చితక సినిమాలు, గేమ్ ఛేంజర్ లాంటి ప్యాన్ ఇండియాలు అన్నీ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఛాన్సులు రావడంలో పెద్ద వింతేమీ లేదు కానీ కోలీవుడ్ దర్శకులు సునీల్ వెంట పడటమే ఆశ్చర్యం. దీనికంతటికి కారణం పుష్పనే. ఇది చూశాకే మనోడి టాలెంట్ అరవ డైరెక్టర్లకు అర్థమయ్యింది.
బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న జైలర్ లో సునీల్ వేసిన వేషం బాగా పేలింది. తమన్నా ఎపిసోడ్ లో చాలా కీలకంగా వ్యవహరించిన క్యారెక్టర్ కావడంతో పాటు కామెడీ టచ్ ఉండటంతో జనం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. రజనీకాంత్ తో కాంబినేషన్ సీన్లు లేనప్పటికీ రెస్పాన్స్ చూసిన సునీల్ హ్యాపీగానే ఉన్నాడు. దీనికన్నా ముందు శివకార్తికేయన్ మహావీరుడులో ముఖ్యమంత్రి సెక్రెటరిగా చేయడం పేలింది. సెప్టెంబర్ 15 విడుదల కాబోతున్న విశాల్ మార్క్ ఆంటోనీలో వీటన్నిటిని మించిన రోల్ దక్కించుకున్నాడని చెన్నై టాక్. కథ ఇక్కడితో అయిపోలేదు.
లారెన్స్ మాస్టర్ తమ్ముడు ఎల్విస్ హీరోగా రూపొందబోయే బుల్లెట్ లో సునీల్ కు క్రేజీ ఆఫర్ ఇచ్చారు. తెలుగమ్మాయి వైశాలి రాజ్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఇన్నసి పాండియన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషల్ ఎంటర్ టైనర్ లో లారెన్స్ సైతం ఒక ప్రత్యేక క్యామియో చేయబోతున్నాడు. లా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఇది రూపొందనుంది. సునీల్ పాత్ర తాలూకు లీక్స్ లేవు కానీ లారెన్స్ రికమండేషన్ మీదే ఇది సాధ్యమయ్యిందట. కార్తీ జపాన్ లోనూ సునీల్ ఉన్నాడు. ఎలాగూ ఇవన్నీ డబ్బింగ్ రూపంలో తెలుగులో వస్తాయి కాబట్టి ఎంచక్కా ఉభయకుశలోపరి పథకం కింద రెండు రకాలుగా లాభపడుతున్నాడు.
This post was last modified on August 15, 2023 3:49 pm
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…