బాహుబలి లాంటి సినిమా చేసిన తర్వాత జాతీయ వ్యాప్తంగా వచ్చిన ఇమేజ్‍ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. బాహుబలి విడుదలకి ముందే తదుపరి రెండు చిత్రాలను యువ దర్శకులతో ప్రభాస్ ఓకే చేసేసుకోవడం వల్ల బాహుబలి తర్వాత ప్లానింగ్‍కి టైమ్ కుదరలేదు. అప్పట్నుంచీ షూటింగ్స్తోనే బిజీగా వున్న ప్రభాస్‍కి ఈ లాక్ డౌన్ వల్ల చాలా తీరిక సమయం దొరికింది. అందుకే వివిధ దర్శకులు చెప్పిన కథలు విని తనకు బాగా నచ్చినవి, తన పాన్ ఇండియా ఇమేజ్‍కి సరితూగుతాయని అనిపించినవీ ప్రభాస్ ఎంచుకున్నాడు.
ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా, సురేందర్ రెడ్డి తదితరులు చెప్పిన కథలు ప్రభాస్‍కి నచ్చలేదు. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ని సింగిల్ సిట్టింగ్‍లో ఓకే చేసిన ప్రభాస్ ‘ఆదిపురుష్’తో బాలీవుడ్‍లో స్ట్రెయిట్ సినిమా చేయాలనే లక్ష్యం కూడా చేరుకుంటున్నాడు. ఒకవేళ లాక్ డౌన్ లేనట్టయితే ప్రభాస్ ఈ టైమ్‍లో రాధేశ్యామ్ షూటింగ్ కోసం యూరప్ పరిసర ప్రాంతాల్లో వుండేవాడు. లాక్ డౌన్ వల్ల చాలా మంది దర్శకులను కలిసి, కథలు ఎంచుకునే సౌలభ్యం చిక్కింది. ఈ లాక్ డౌన్‍ని ఇంత ఎఫెక్టివ్‍గా వాడుకున్న మరో హీరో లేడంటే అతిశయెక్తి కాదు.
This post was last modified on August 19, 2020 12:11 am
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే...…
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…
గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…