సరిగ్గా ఏడాదిన్నర క్రితం పెద్దన్న(అన్నాతే) రిలీజైనప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ పనైపోయిందనే అందరూ అనుకున్నారు. రొట్ట రొటీన్ సిస్టర్ సెంటిమెంట్ కథతో ఎన్నోసార్లు చూసిన కమర్షియల్ కిచిడిని మళ్ళీ చూపించడంతో తమిళంలో ఓ మోస్తరుగా ఆడినా బయట మాత్రం ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. కట్ చేస్తే జైలర్ చేస్తున్న ఊచకోతకు ఎవరికీ నోట మాట రావడం లేదు. నచ్చితే చాలు అది డబ్బింగ్ స్ట్రెయిటాని పట్టించుకునే అలవాటే లేని తెలుగు ఆడియన్స్ జైలర్ కి బ్రహ్మరధం పడుతున్నారు. ఒక అనువాద చిత్రానికి రోజు రోజుకు షేర్ పెరగడం అనూహ్యం.
రోజుకు వంద కోట్లు వసూలు చేయనిదే జైలర్ కు నిద్ర రావడం లేదు. అన్ని భాషలు కలిపి బుధవారం అంటే మొదటి వారం ఫైనల్ డేకల్లా 500 కోట్లు చేరుకోవడం ఖాయమని ట్రేడ్ అంచనా వేస్తోంది. బాక్సాఫీస్ వద్ద పరిస్థితి గమనిస్తే ఇది నిజమేనని ఒప్పుకోక తప్పదు. ఒకవేళ నార్త్ లో గదర్ 2 ప్రభంజనం లేకపోతే బాలీవుడ్ లోనూ జెండా పాతేదని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. అయినా హిందీ మార్కెట్ ని సన్ పిక్చర్ సీరియస్ గా తీసుకోలేదు. మొత్తం బ్రేక్ ఈవెన్ మూడు రోజుల్లోనే అయిపోవడంతో నిర్మాతల ఆనందం అంతా ఇంతా కాదు.
ఫైనల్ రన్ కు ఇంకా టైం పట్టేలా ఉంది. రజనికి దీటుగా పోటీ ఇచ్చే చెప్పుకోదగ్గ సినిమాలు ఈ నెలాఖరు వరకు లేవు. పైగా కమల్ హాసన్ విక్రమ్ కొన్ని మాస్ వర్గాలకు పూర్తిగా రీచ్ కాలేదు. కానీ జైలర్ కు ఆ ఇబ్బంది లేదు. చిన్న చిన్న బిసి సెంటర్లలోనూ హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఈ వారాంతం కూడా పూర్తిగా సూపర్ స్టార్ కంట్రోల్ లోకి వెళ్లిపోవడం లాంఛనమే. ఏపీ తెలంగాణ షేర్లు మతులు పోగొట్టడం కన్ఫర్మ్. కేవలం 12 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేస్తే అంతకు మూడింతలు షేర్ టార్గెట్ గా పెట్టుకోవడం ఎవరూ ఊహించనిది. రజనికి మంచి కంటెంట్ పడితేనే ఇలా ఉంది బాషా, నరసింహ రేంజ్ వస్తే హాళ్లు తగలబడిపోతాయేమో.
This post was last modified on August 15, 2023 1:15 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…