సరైన విడుదల తేదీ కోసం దర్శక నిర్మాతలు చేస్తున్న కసరత్తు అంతా ఇంతా కాదు. ముందే కర్చీఫ్ వేయకపోతే ఎక్కడ పోటీకి వేరొకరు వచ్చేస్తారనే ముందు చూపుతో మూడు నెలల ముందే ప్రకటనలు ఇస్తున్నారు. అయితే సాధారణంగా డిసెంబర్ నెలని కొంత డ్రైగా భావిస్తుంది టాలీవుడ్. ఎందుకంటే కలెక్షన్లు ఈ సీజన్ లో అంత ఉధృతంగా ఉండవు. ఒకటి రెండు అయితే పర్వాలేదు కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే ఇబ్బందే. కానీ ఈసారి మాత్రం హీరోలు నువ్వా నేనా అంటూ వరసపెట్టి డేట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు. చూస్తుంటే ఆ మంత్ బాగా ప్యాక్ అయ్యేలా ఉంది.
డిసెంబర్ 1 రన్బీర్ కపూర్- సందీప్ వంగాల ‘యానిమల్’ వస్తోంది. దీని మీద ఓ రేంజ్ అంచనాలున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో ఆగస్ట్ 11 నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు. వారం గ్యాప్ తో వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ డిసెంబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్టు ఇవాళే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంతకు ముందే విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’కి అదే డేట్ ని లాక్ చేశారు. సో కుర్ర హీరోల మధ్య క్లాష్ తప్పదు. 15న ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ వస్తుంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన మూవీ కాబట్టి విడుదల కూడా గ్రాండ్ గా ఉంటుంది.
అసలైన తాకిడి ఆ తర్వాత ఉంది. 21న నాని ‘హాయ్ నాన్న’ బరిలో దిగుతాడు. ఒక్క రోజు గ్యాప్ తో వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తీసిన ‘సైంధవ్’ని సిద్ధం చేయబోతున్నారు. నిర్మాణ దశలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రిస్క్ అని తెలిసినా సుధీర్ బాబు ‘హరోం హర’ అదే తేదీకి ఫిక్స్ అయ్యింది. ఇరవై నాలుగు గంటలు గడవకుండానే నితిన్ ‘ఎక్స్ ట్రాడినరి మ్యాన్’ థియేటర్లలో ఉంటుంది. ఇవి కాకుండా షారుఖ్ ఖాన్ ‘డుంకి’ వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం. ఇదే జరిగితే ఒకే వారంలో అయిదు క్రేజీ రిలీజులు ఉంటాయి . చూస్తుంటే డిసెంబర్ నెల మూవీ లవర్స్ జేబులకు చిల్లులు పెట్టడం ఖాయం.
This post was last modified on August 14, 2023 10:56 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…