‘భోళా శంకర్’ సినిమా మెగా అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్ఞాపకం అయ్యేలాగే కనిపిస్తోంది. ‘ఆచార్య’ను మించి చిరు కెరీర్లో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవబోతోందన్నది స్పష్టం. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి మెగా అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే వస్తోంది. అసలే రీమేక్.. పైగా రొటీన్ మాస్ మూవీ.. అందులోనూ మెహర్ రమేష్ డైరెక్షన్ అనేసరికి అప్పట్లోనే బెంబేలెత్తిపోయారు ఫ్యాన్స్. ఈ సినిమా వద్దే వద్దంటూ చిరును సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. కానీ చిరు అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు.
అందుకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఈ దెబ్బతో అయినా చిరు రీమేక్‌లు మానేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ చిరు మాత్రం ‘బ్రో డాడీ’ ఆధారంగా కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఇది రీమేక్ కాదని ఓ ప్రచారం నడుస్తున్నప్పటికీ అభిమానులు నమ్మట్లేదు. కథను ఎంతగా మార్చినా సరే.. మూలం అయితే ‘బ్రో డాడీ’నే కదా అంటున్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ట్రాక్ రికార్డు కూడా అంతంతమాత్రం కావడం.. అతడిది ఓల్డ్ స్టైల్ టేకింగ్ కావడంతో ఆ చిత్రం మీదా పెద్దగా అంచనాలు లేవు. దీని తర్వాత చిరు చేయబోయే సినిమా మీదే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
ఆ చిత్రాన్ని రూపొందించబోయేది ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట కావడం వారి ఆశలకు కారణం. ఇలాంటి యువతరం దర్శకులతో చిరు పని చేయాలన్నదే అభిమానుల ఆశ. ‘బింబిసార’లో ఫాంటసీ టచ్ ఉన్న కథను వశిష్ఠ డీల్ చేసిన విధానం ప్రశంసలందుకుంది. చిరుతో కూడా అతను ఫాంటసీ సినిమానే చేయబోతున్నాడట. చిరుతో ఈ జానర్ అనగానే అందరికీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా గుర్తుకు వస్తుంది. పెద్ద కాన్వాస్‌లో, బడ్జెట్లో ఈ సినిమా తీయడానికి యువి క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది. చిరు స్టామినాను వశిష్ఠ సరిగా వాడుకుని తన పనితనం చూపిస్తే కచ్చితంగా ఒక మెగా బ్లాక్‌బస్టర్ చూడొచ్చన్న ఆశలతో ఫ్యాన్స్ ఉన్నారు.
This post was last modified on August 14, 2023 10:31 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…