కోలీవుడ్లో కొన్నేళ్ల నుంచి విజయ్, అజిత్‌ల మధ్యే బాక్సాఫీస్ రికార్డుల పోటీ నడుస్తోంది. కానీ అంతకుముందంతా రజినీకాంత్ హవానే నడిచింది. విజయ్, అజిత్ ఆయన ముందు అసలు నిలిచేవారే కాదు. వీళ్లిద్దరూ పెద్ద స్టార్లుగా ఎదగడానికి ముందు తమిళంలో సూపర్ స్టార్‌కు బలమైన పోటీ ఇచ్చింది లోకనాయకుడు కమల్ హాసనే. 80, 90 దశకాల్లో వీరి మధ్య గట్టి పోటీనే ఉండేది. వైవిధ్యమైన సినిమాలతోనే కమల్ రికార్డ్ బ్రేకింగ్ హిట్లు ఇచ్చాడు.
చివరగా ఆయన రజినీకాంత్‌ను దాటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిందంటే 1996లో వచ్చిన ‘భారతీయుడు’తోనే. అప్పటికి ఉన్న రజినీ సినిమాల బాక్సాఫీస్ రికార్డులన్నీ ఈ చిత్రంతో అధిగమించాడు కమల్. కానీ ఆ రికార్డులు మరీ ఎక్కువ కాలం నిలవలేదు. 1999లో రిలీజైన ‘పడయప్పా’ (నరసింహా) సినిమాతో రజినీ కొత్త రికార్డులు నెలకొల్పాడు. ఆ తర్వాత కమల్‌కు రజినీ రికార్డులు బద్దలు కొట్టడం చాలా కష్టమైపోయింది.
కమల్ రేంజ్ పడుతూ వస్తే.. చంద్రముఖి, శివాజి, రోబో, 2.0.. ఇలా ఒక్కో సినిమాతో కొత్త రికార్డులు నెలకొల్పుతూ వెళ్లాడు రజినీ. ఐతే చాలా ఏళ్ల పాటు అసలు కలెక్షన్ల చర్చల్లోనే లేకుండా పోయిన కమల్ హాసన్ గత ఏడాది ‘విక్రమ్’ సినిమాతో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. రజినీ సినిమాల వసూళ్ల రికార్డులను అధిగమించాడు. తమిళనాడు వరకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఐతే ఈ రికార్డు కేవలం ఏడాది మాత్రమే నిలిచింది.
ఇప్పుడు రజినీ ‘జైలర్’ మూవీతో వసూళ్ల మోత మోగిస్తున్నాడు. వరల్డ్ వైడ్ ఈ సినిమా ఆల్రెడీ రూ.300 కోట్ల మార్కును దాటేసింది. ఇంకో పది రోజులైనా ఈ సినిమా ఊపు కొనసాగేలా ఉంది. ఆల్రెడీ ‘విక్రమ్’ తమిళనాడు వసూళ్లను ఈ సినిమా దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫుల్ రన్లో ‘.2.0’ను కూడా అధిగమించి కొత్త రికార్డును రజినీ నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. కమల్ 23 ఏళ్ల తర్వాత రజినీ సినిమాను అధిగమిస్తే.. ఇంకో ఏడాదికే ఆ రికార్డును కొట్టి సూపర్ స్టార్ తనేంటో చూపించాడంటూ ఆయన అభిమానులు ఎలివేషన్లు ఇస్తున్నారు.
This post was last modified on August 14, 2023 6:21 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…