Movie News

జవాన్ VS శెట్టీస్ – ఇంటరెస్టింగ్

చాలా గ్యాప్ తర్వాత స్వీటీ అనుష్కని ఎప్పుడెప్పుడు తెరమీద చూద్దామా అని ఎదురు చూస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదల ఎట్టకేలకు సెప్టెంబర్ 7కి లాక్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. గత కొద్దిరోజులుగా యువి టీమ్ దీని మీద తీవ్ర తర్జనభర్జనలు చేసింది. ఒకటో తేదీ వద్దామంటే  విజయ్ దేవరకొండ ఖుషి ఉంది. పోనీ మూడో వారం వద్దామంటేనేమో స్కంద, చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీలు కాచుకుని ఉన్నాయి. దీని కంటే షారుఖ్ ఖాన్ జవాన్ ని ఫేస్ చేయడమే ఈజీ అని భావించిన నిర్మాతలు ఫైనల్ గా ఏడుకే ఓటు వేశారు. ఇక్కడిదాకా బాగానే ఉంది.

చేతిలో ఉన్న ఇరవై రోజుల్లో ప్రమోషన్లు పీక్స్ కు చేరుకోవాలి. ఎందుకంటే జవాన్ ని మరీ తక్కువంచనా వేయడానికి లేదు. తీసింది మన టేస్ట్ కి దగ్గరగా ఉండే తమిళ దర్శకుడు ఆట్లీ కాబట్టి కంటెంట్ కనెక్ట్ అయ్యిందా ఇక్కడా వసూళ్ల వర్షం కురుస్తుంది. పఠాన్ లో సౌత్ స్టైల్ కమర్షియల్ యాక్షన్ లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. అలాంటిది నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకునే లాంటి ఆకర్షణలు ఉన్న జవాన్ మీద ఆటోమేటిక్ గా బజ్ వచ్చేస్తుంది. వీటికన్నా ఎక్కువ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కోసమే సినిమాలకు వెళ్లే యూత్ పెరుగుతున్నారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుంది. హీరో నవీన్ కిందటి నెల నుంచే ఎడతెరిపి లేకుండా ఏదో ఒక రూపంలో ప్రమోషన్లు చేస్తూనే ఉన్నాడు. అసలైన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఒక పబ్లిక్ వేడుకలో అనుష్క మాట్లాడ్డం చూసి సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడేం చెబుతుందో ఎలా ఉంటుందోననే ఉత్సుకత ఫ్యాన్స్ లో ఉంది. తానుగా కోరుకుని బ్రేక్ తీసుకుంది కానీ అనుష్క కోరుకుంటే ఆఫర్లకు కొదవలేదు. మరి ఈ సినిమా కనక హిట్ అయితే కంటిన్యూ అవుతుందో లేదోననే సస్పెన్స్ లేకపోలేదు. 

This post was last modified on August 14, 2023 6:19 pm

Share

Recent Posts

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

8 minutes ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

33 minutes ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

43 minutes ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

1 hour ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

1 hour ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

3 hours ago