రీ రిలీజుల ట్రెండ్ లో సీనియర్ జూనియర్ హీరోల్లో దాదాపు అందరివీ ఒకటో రెండో పాత సినిమాలు థియేటర్లకు వచ్చేసి కాసులు కురిపించేశాయి. మహేష్ బాబువి ఏకంగా మూడు హంగామా చేశాయి. ఇక బ్యాలన్స్ ఉన్నది నాగార్జున, వెంకటేష్ లే. ఈ నెల 29న కింగ్ పుట్టినరోజుని పురస్కరించుకుని మన్మథుడుని మళ్ళీ విడుదల చేయబోతున్నారని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఈ కల్ట్ ఎంటర్ టైనర్ కి విజయభాస్కర్ దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన మాటలు, దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.
వాస్తవానికి దీనికన్నా ముందు నాగ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ శివని పెద్ద తెరపై చూసుకోవాలని మూవీ లవర్స్ కోరిక. కొన్నేళ్ల క్రితం దీని పాతికేళ్ల యానివర్సరీ సందర్భంగా రీ మాస్టర్ చేయిస్తున్నామని చెప్పారు కానీ తర్వాత ఎలాంటి ఊసు లేదు. ట్విస్టు ఏంటంటే శివ ఒరిజినల్ నెగటివ్ అందుబాటులో లేదట. కొన్ని భాగాలు డ్యామేజ్ కావడంతో వాటిని సరిద్దిదడానికి ఎక్కువ సమయం అవసరం ఉండటంతో లేట్ అవుతోందని తెలిసింది. అందుకే శివ స్థానంలో మన్మథుడుకి అంగీకారం తెలిపినట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ త్వరలో వెలువడవచ్చు.
టాలీవుడ్ కున్న పెద్ద సమస్య ఒకప్పటి బ్లాక్ బస్టర్ల మాస్టర్ ప్రింట్లు సరిగా అందుబాటులో లేకపోవడం. హాలీవుడ్ తరహాలో ఎప్పటికప్పుడు టెక్నాలజీని వాడుకుంటూ వాటిని కాపాడే ప్రయత్నం పెద్దగా జరగలేదు. మగధీరనే ఒరిజినల్ ఫుటేజ్ దొరకడం లేదని రాజమౌళి ఓ ఈవెంట్ లో చెప్పిన వీడియో యూట్యూబ్ లో చూడొచ్చు. దీనికే ఇలా ఉంటే ఇక శివ, ఖైదీ, మంగమ్మగారి మనవడు లాంటివి ఇంకెంత క్షేమంగా భద్రపరిచి ఉండాలి. ఇంకో యాభై సంవత్సరాల తర్వాతైనా సరే కొత్త తరాలు గొప్పగా అనుభూతి చెందేలా అన్నిటిని ఫోర్ కెతో అప్డేట్ చేయించే ఆవశ్యకతని అర్జెంట్ గా గుర్తించాలి.
This post was last modified on August 14, 2023 12:05 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…