పాపం టాలెంట్, బడా బ్యానర్ల అండదండలు, ఇమేజ్ ఉన్న దర్శకులతో సినిమాలు చేస్తున్నా సరే సంతోష్ శోభన్ కు హిట్టు అందని ద్రాక్షే అయ్యింది. వైజయంతి లాంటి పెద్ద సంస్థతో అన్నీ మంచి శకునములే చేస్తే అది కూడా డిజాస్టర్ కావడంతో ఈ కుర్ర హీరోకు ఏం పాలు పోవడం లేదు. అంతకు ముందు శ్రీదేవి శోభన్ బాబు, కళ్యాణం కమనీయం, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, మంచి రోజులు వచ్చాయి అన్నీ ఒకదాన్ని మించి మరొకటి దెబ్బ కొట్టిన కళాఖండాలు. ఓటిటిలో డైరెక్ట్ గా వచ్చిన ఏక్ మినీ కథ తప్ప మరో చెప్పుకునే విజయం ఇప్పటిదాకా జమ కాలేదు.
ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ సంతోష్ శోభన్ కు అవకాశాల లోటు లేదు. నిర్మాతలు వస్తూనే ఉన్నారు. రాబోయే శుక్రవారం ఆగస్ట్ 18 ప్రేమ్ కుమార్ విడుదల కానుంది. రాశి సింగ్ హీరోయిన్. ప్రమోషన్లు గట్రా బాగానే చేస్తున్నారు. కంటెంట్ కూడా ఇంటరెస్టింగ్ గానే ఉంది. డేట్ పరంగా ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు లేవు. సుహైల్ మిస్టర్ ప్రెగ్నెంట్ ని జనాలు సీరియస్ గా తీసుకునేలా కనిపించడం లేదు. సో ప్రేమ్ కుమార్ ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించుకున్నా చాలు దానికి పెట్టిన బడ్జెట్ కి ఈజీగా గట్టెకేస్తాడు.
ఆ టైంకల్లా భోళా శంకర్ దాదాపుగా వాషౌట్ అయిపోతుంది. జైలర్ దూకుడు కొంతయినా తగ్గుతుంది. గదర్ 2, ఓ మై గాడ్ 2లను తెలుగు ఆడియన్స్ మరీ గొప్పగా రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ని తనవైపుకు తిప్పుకుంటే ప్రేమ్ కుమార్ కి ప్రయోజనం ఉంటుంది. ఆపై వారం దుల్కర్ సల్మాన్, వరుణ్ తేజ్, కార్తికేయలు వచ్చేస్తారు కాబట్టి వారం రోజుల్లోనే వీలైనంత రాబట్టుకోవాలి. తర్వాత థియేటర్లు తగ్గిపోతాయి. అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఏదైనా బ్రేక్ ఇస్తేనే సంతోష్ శోభన్ కెరీర్ లో కాస్త జోష్ వస్తుంది. పబ్లిసిటీ కూడా పెంచాల్సిందే.
This post was last modified on August 13, 2023 2:52 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…