ప్రస్తుతం టాలీవుడ్లో డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. పెద్ద సినిమాల్లో పెట్టుబడి వెనక్కి తెస్తున్న సినిమాల శాతం చాలా తక్కువగా ఉంటోంది. మంచి టాక్ తెచ్చుకుని ‘బ్లాక్‌బస్టర్’ అనిపించుకున్న సినిమాల నుంచి కూడా లాభాలు తక్కువగానే ఉంటున్నాయి. కానీ సినిమా తేడా కొడితే వచ్చే నష్టాలు మాత్రం భారీగా ఉంటున్నాయి. నష్టపరిహారాల తాలూకు సెటిల్మెంట్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. నెమ్మదిగా డిస్ట్రిబ్యూటర్లు ఒక్కొక్కరుగా కాడి వదిలేస్తున్న పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా అగ్ర నిర్మాత దిల్ రాజు మాత్రం డిస్ట్రిబ్యూషన్లో మంచి సక్సెస్ రేట్‌తో సాగుతున్నారు. ఏ సినిమాను కొనాలి.. ఎంతకు కొనాలి అనే విషయంలో రాజుకు ఉన్న జడ్జిమెంట్ టాలీవుడ్లో ఇంకెవరికీ లేదు అంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఇండిపెండెన్స్ డే వీకెండ్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’, సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘జైలర్’ రిలీజైతే.. ఆయన డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నది ‘జైలర్’ మూవీకే.
మామూలుగా అయితే చిరు, రజినీ పోటీలో ఉంటే దిల్ రాజు లాంటి డిస్ట్రిబ్యూటర్ చిరు వైపే ఉండాలి. అందులోనూ ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరు సినిమా అంటే దాని హక్కుల కోసమే ఎగబడాలి. కానీ ‘భోళా శంకర్’ మీద దిల్ రాజుకు సరైన అంచనానే ఉన్నట్లుంది. అందుకే దాని జోలికి వెళ్లలేదు. అదే సమయంలో రజినీకాంత్ చివరి సినిమాలు దారుణమైన ఫలితాలు అందుకున్నా సరే.. ఆయన సునీల్ నారంగ్‌తో కలిసి ‘జైలర్’ రైట్స్ తీసుకున్నారు. రజినీ మార్కెట్ దెబ్బ తినడం వల్ల తక్కువ మొత్తానికే హక్కులు దక్కాయి.
‘జైలర్’ రిలీజ్ ముంగిట ఊహించని విధంగా మంచి హైప్ తెచ్చుకుంది. టాక్ యావరేజ్‌గా ఉన్నా సరే.. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ‘భోళా శంకర్’ తేడా కొట్టడంతో ‘జైలర్’ వసూళ్లు ఇంకా పెరిగిపోయాయి. రజినీ ఒకప్పటి వైభవాన్ని గుర్తు చేస్తూ ఈ సినిమా వీకెండ్లో వసూళ్ల మోత మోగించేసింది. ఇండిపెండెన్స్ డే వరకు ‘జైలర్’ దూకుడు కొనసాగబోతోంది. దిల్ రాజు పెట్టుబడి మీద మూడు రెట్ల ఆదాయం వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయంటే ఆయన జాక్‌పాట్ కొట్టినట్లే చెప్పాలి.
This post was last modified on August 13, 2023 12:54 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…