ప్రభాస్ ప్రస్తుతం దృష్టి రెండు చిత్రాల మీద ఉంది. ఓవైపు ‘కల్కి 2898 ఏడీ’ లాంటి భారీ చిత్రానికి పని చేస్తూనే.. మరోవైపు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లోనూ సమాంతరంగా పాల్గొంటున్నాడు. రెంటికీ డేట్లు సర్దుబాటు చేస్తూ వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ‘సలార్’కు సంబంధించి ప్రభాస్ పని చాలా వరకు ముగిసినట్లే. కొంచెం డబ్బింగ్ వర్క్ మిగిలున్నట్లు తెలుస్తోంది.
తర్వాత ప్రమోషన్లలో పాల్గొనాల్సి ఉంది. వచ్చే ఏడాదిలో కొత్త సినిమాను మొదలుపెట్టడానికి చూస్తున్నాడు ప్రభాస్. ‘స్పిరిట్’ పేరుతో తెరకెక్కనున్న ఆ సినిమాను రూపొందించబోయేది సందీప్ రెడ్డి వంగ అన్న సంగతి తెలిసిందే. అతను ప్రస్తుతం ‘యానిమల్’ను విడుదలకు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం డిసెంబర్ మొదటి వారంలో రిలీజవుతుంది. ఆ తర్వాత ‘స్పిరిట్’ పని మొదలుపెడతాడు.
ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి చాలా సమయం ఉండగానే.. ఒక కీలక అప్‌డేట్ బయటికి వచ్చింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్ ఫిక్సయ్యాడట. అతణ్ని వెలుగులోకి తెచ్చింది సందీప్ రెడ్డినే. ‘అర్జున్ రెడ్డి’కి హర్షవర్ధన్ అందించిన నేపథ్య సంగీతం సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాలీవుడ్లో గత దశాబ్ద కాలంలో వచ్చిన బెస్ట్ స్కోర్స్‌లో ‘అర్జున్ రెడ్డి’ది ఒకటిగా చెప్పొచ్చు. అతడితోనే హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’కు కూడా స్కోర్ చేయించుకున్నాడు సందీప్.
ఐతే ఈ సినిమాల తర్వాత తనపై పెట్టుకున్న అంచనాలను హర్షవర్ధన్ నిలబెట్టుకోలేకపోయాడు. అయినా సందీప్ అతడిపై నమ్మకం పెట్టి ప్రభాస్ సినిమాకు పూర్తి స్థాయిలో సంగీతం అందించే అవకాశం కల్పిస్తున్నాడట. ఐతే ‘కల్కి’కి కూడా ఇలాగే ముందు మిక్కీ జే మేయర్‌ను తీసుకున్నారు. కానీ అతను ఇంత పెద్ద ప్రాజెక్టును డీల్ చేయలేడని.. తర్వాత సంతోష్ నారాయణన్‌ను ఎంచుకున్నారు. మరి ‘స్పిరిట్’ విషయంలో సందీప్ రిస్క్ చేసి హర్షవర్ధన్‌తోనే కంటిన్యూ అవుతాడా.. లేక మధ్యలో ఇంకెవరైనా తెరపైకి వస్తారా అన్నది చూడాలి.
This post was last modified on August 12, 2023 6:06 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…