పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న హీరోలకు సినిమాలు, పాత్రల ఎంపికలో కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రతిదీ అభిమానులను దృష్టిలో ఉంచుకునే చేయాల్సి ఉంటుంది. కొంచెం కొత్తగా ట్రై చేయాలంటే అభిమానులు అంగీకరిస్తారో లేదో అన్న భయం వెంటాడుతుంది. అందుకే ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతుంటారు. వయసు పెరుగుతున్నా యువకుల పాత్రలే వేస్తుంటారు.
మహా అయితే ఒక బిడ్డకు తండ్రిగా నడి వయస్కుల పాత్రలు వేస్తారే తప్ప.. తాతల క్యారెక్టర్లు వేయాలంటే మాత్రం వెనుకంజ వేస్తుంటారు. డబుల్ రోల్ చేసినపుడు తండ్రి పాత్ర కోసం తెల్లజుట్లు కనిపిస్తారే తప్ప.. మాస్ హీరోలు ఫుల్ లెంగ్త్‌లో ముసలి పాత్రలు చేయడం అరుదు. కానీ ఈ మధ్య ట్రెండు మారుతోంది. తమిళంలో ఇద్దరు సీనియర్ హీరోలు ధైర్యం చేసి తాత పాత్రల్లో కనిపించి అభిమానులను మెప్పించారు. ఒప్పించారు. వాళ్లే.. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్.
కమల్ హాసన్ గత ఏడాది ‘విక్రమ్’ సినిమాలో చేసింది తాత పాత్రే. సినిమాలో పూర్తిగా ఆయన ఆ పాత్రలోనే కనిపించారు. ఆయనకు అందులో కొడుకు, మనవడు కూడా ఉన్నాడు. సరిగ్గా ఇంత వయసు అని చెప్పలేదు కానీ.. 60 ఏళ్లు పైబడ్డట్లుగా అంచనా వేయొచ్చు. ఆ వయసు పాత్ర అయినా.. అందులో హీరోయిజం ఒక రేంజిలో పండింది. ఎక్కడా అభిమానులకు ఇబ్బందిగా అనిపించలేదు. ఇక లేటేస్ట్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్ తాత పాత్రలో కనిపించి మెప్పించారు. ‘జైలర్’లో ఆయనకు కొడుకు.. మనవడు ఉన్నారు. ఆ మనవడు కూడా ఏడెనిమిదేళ్ల వయసున్నట్లు కనిపిస్తాడు.
రజినీ ఇందులో రిటైర్డ్ జైలర్ పాత్రలో కనిపించారు. కమల్‌తో పోలిస్తే రజినీకి మాస్ ఇమేజ్ ఎక్కువ. అభిమానుల నుంచి చాలా ఆబ్లిగేషన్స్ ఉంటాయి. కానీ అవేవీ పట్టించుకోకుండా ఆయన తాత పాత్రలో ఒదిగిపోయారు. అభిమానులనూ మెప్పించారు. ఇంతకుముందు కబాలి, కాలా, పేట సినిమాల్లో సైతం రజినీ పెద్ద వయస్కుడిగా కనిపించడం విశేషం. మన సీనియర్ హీరోలు కూడా ఇలా పరిమితులు పెట్టుకోకుండా వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తే అభిమానులు అంగీకరిస్తారనడంలో సందేహం లేదు.
This post was last modified on August 11, 2023 7:35 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…