మెగా ఫ్యామిలీని.. ఆ ఫ్యామిలీ హీరోల అభిమానులను ఒక కలవరపాటుకు గురి చేసి చాలా ఏళ్ల పాటు వెంటాడిన సినిమా ‘ఆరెంజ్’. ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అప్పట్లో. ఆడియో బ్లాక్ బస్టర్ కావడంతో సినిమా గురించి ఏదో ఊహించుకున్నారు ఫ్యాన్స్.
కానీ వారి అంచనాలకు భిన్నంగా క్లాస్‌గా, స్లోగా, బోరింగ్‌గా సాగడంతో సినిమా మెజారిటీ జనాలకు రుచించలేదు. ఫ్యాన్స్‌కు అయితే అదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. చరణ్ కెరీర్‌కు పెద్ద స్పీడ్ బ్రేకర్ అయిందీ సినిమా. ఈ చిత్రం వల్లే నాగబాబు తీవ్రంగా నష్టపోయి.. ఒక దశలో ఆత్మహత్య ఆలోచన కూడా చేసినట్లు స్వయంగా వెల్లడించాడు. మరి ఇలాంటి ఫలితాన్నందుకున్న సినిమా దర్శకుడి పరిస్థితి ఏంటో అంచనా వేయడం కష్టం కాదు.
‘ఆరెంజ్’ దెబ్బకు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ మసకబారి.. చాలా ఏళ్లు కనిపించకుండా పోయాడు. దీని తర్వాత పదేళ్ల వ్యవధిలో అతను తీసింది ఒక్క ‘ఒంగోలు గిత్త’ మాత్రమే. ఆ సినిమా తర్వాత అంతర్ధానం అయిపోయిన భాస్కర్‌ను పిలిచి సినిమా చేయించింది అల్లు అరవింద్. మెగా ఫ్యామిలీకి, అభిమానులకు అంతటి చేదు అనుభవాన్ని మిగిల్చిన దర్శకుడిపై నమ్మకం పెట్టి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చేయించారు. అది ఓ మోస్తరు ఫలితాన్నే అందుకుంది.
అయినా భాస్కర్ మీద అరవింద్ నమ్మకం సడలిపోలేదు. తిరిగి గీతా ఆర్ట్స్ బేనర్లో ఇంకో ఛాన్స్ ఇచ్చారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కన్ఫమ్ అయ్యాడు. గురువారమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈసారి కొంచెం కమర్షియల్ టచ్ ఉన్న సినిమా చేయబోతున్నాడట భాస్కర్. సిద్ధు లాంటి ఫామ్‌లో ఉన్న హీరో దొరకడం భాస్కర్‌కు కలిసొచ్చే అంశం. మరి భాస్కర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమేర నెరవేరుస్తాడో చూడాలి.
This post was last modified on August 10, 2023 10:19 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…