మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన బిజినెస్ మెన్ అనుకున్నట్టే కొత్త రికార్డులు సెట్ చేసింది. ఎలాగైనా ఇది నెంబర్ వన్ గా నిలవాలన్న అభిమానుల ఆకాంక్ష తీరింది. పదకొండేళ్ల క్రితం వచ్చిన సినిమాకు ఈ స్థాయిలో స్పందన రావడం చూసి డిస్ట్రిబ్యూటర్ వర్గాలు షాక్ అవుతున్నాయి. దీని దెబ్బకే చాలా చోట్ల గత వారం వచ్చిన కొత్త రిలీజులకు కనీస జనం లేక షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. మొదటి రోజు అక్షరాలా 5 కోట్ల 30 లక్షల గ్రాస్ సాధించి ఆల్ టైం రికార్డు సాధించింది. నైజామ్ లో అత్యధికంగా 2 కోట్ల 50 లక్షలు రావడం అరుదైన ఘనత.
దీంతో ఇప్పటిదాకా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఖుషి (4 కోట్ల 14 లక్షలు) రెండో స్థానానికి వెళ్ళింది. ఆ తర్వాత వరసగా సింహాద్రి(4 కోట్లు), జల్సా(3 కోట్ల 20 లక్షలు), ఒక్కడు(2 కోట్లు), ఈ నగరానికి ఏమైంది(1 కోటి 76 లక్షలు), పోకిరి(1 కోటి 72 లక్షలు), ఆరంజ్(1 కోటి 52 లక్షలు), దేశముదురు (1 కోటి 50లక్షలతో)మిగిలిన ర్యాంకుల్లో ఉన్నాయి. సూర్య సన్ అఫ్ కృష్ణన్ అనూహ్యంగా ఈ లిస్టులో 1 కోటి 45 లక్షలతో చివరిగా నిలిచింది. ఇంకా కొన్ని చోట్ల రన్ అవుతోంది కానీ పెద్దగా వసూళ్లు నమోదు కాకపోవచ్చు. మొత్తానికి బిజినెస్ మెన్ రేపిన సంచలనం అభిమానుల్లో ఎక్కడ లేని జోష్ తీసుకొచ్చింది
ఇప్పుడు కొత్త టార్గెట్ రావడంతో నెక్స్ట్ గుడుంబా శంకర్ దీన్ని దాటుతుందా లేదానే అంచనాలు మొదలయ్యాయి. అయితే ఇది అంత సులభంగా ఉండకపోవచ్చు. అప్పట్లోనే అబోవ్ యావరేజ్ గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు బాగానే రిసీవ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మణిశర్మ పాటలు, పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఖుషిని బిజినెస్ మెన్ దాటేసిందన్న అంశం మనసులో ఉంటుంది కనక ఫ్యాన్స్ థియేటర్లకు పోటెత్తే అవకాశాలున్నాయి. ఆగస్ట్ 31 నుంచే స్క్రీనింగ్స్ ఉండబోతున్నాయి. బిజినెస్ మెన్ దెబ్బకు రాబోయే రోజుల్లో చాలా రీరిలీజులు క్యూ కట్టడం ఖాయం.
This post was last modified on August 10, 2023 10:41 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…