ప్రభాస్ ఉన్నట్లుండి పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు అభిమానులకు. ‘బాహుబలి’తో తర్వాత ఉత్తరాదిన కూడా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్‌తో డైరెక్ట్ హిందీ సినిమా చేయాలని అక్కడి వాళ్లు చేస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది.
‘తానాజీ’తో సత్తా చాటుకున్న ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ పేరుతో ఒక భారీ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఆ సినిమా గురించి అనౌన్స్ చేస్తూ 2021లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని.. 2022లో విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు.
ఇది చాలామందిని ఆశ్చర్యానికి, కొంతమందిని విస్మయానికి గురి చేసింది. ఎందుకంటే ప్రభాస్ కమిట్మెంట్ల ప్రకారం చూస్తే ఈ సినిమా వచ్చే ఏడాదే మొదలై.. తర్వాతి ఏడాది విడుదలయ్యే అవకాశం లేదు.
ప్రభాస్ ఇంకా తన 20వ సినిమా అయిన ‘రాధేశ్యామ్’నే పూర్తి చేయలేదు. ఈ సినిమా కోసం ఇంకా కొన్ని నెలలు పన చేయాల్సి ఉంది. దాన్ని పూర్తి చేశాక నాగ్ అశ్విన్ సినిమాలో అతను నటిస్తాడని అంతా అనుకుంటున్నారు. దాన్ని ‘ప్రభాస్ 21’గా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. అది భారీగా విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్, భారీ లొకేషన్లతో ముడిపడ్డ సినిమా.
కనీసం ఏడాది పాటు చిత్రీకరణ జరపాల్సి ఉంటుంది. ప్రస్తుత కరోనా ప్రభావం చూస్తుంటే.. ‘రాధేశ్యామ్’ను పూర్తి చేశాక నాగ్ అశ్విన్ సినిమాను వచ్చే ఏడాది మధ్యలో కానీ మొదలు పెట్టే అవకాశం లేదు. ఈ సంగతి తెలిసి కూడా ‘ఆదిపురుష్’ను 2021లో మొదలుపెట్టి 2022లో విడుదల చేస్తామని ప్రకటించారంటే ఏదో తేడాగానే అనిపిస్తోంది.
అశ్విన్ సినిమాను ప్రభాస్ హోల్డ్‌లో పెట్టి.. ముందు ఓం రౌత్ మూవీని పూర్తి చేసి.. ఆ తర్వాతే దాని సంగతి చూస్తాడేమో అనిపిస్తోంది. ఆ లెక్కన ‘ఆదిపురుష్’యే ప్రభాస్ 21వ సినిమాగా భావించాల్సి ఉంటుంది.
This post was last modified on August 20, 2020 3:18 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…