పదేళ్లు వెనక్కి వెళ్తే సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్‌ను సౌత్ ఇండియాలో ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు అన్నట్లుండేది. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, తన సినిమాల బడ్జెట్లు, వసూళ్లు అన్నీ కూడా వేరే లెవెల్లో ఉండేవి. కానీ ‘కబాలి’ సినిమా తర్వాత రజినీ క్రేజ్, మార్కెట్ పడుతూ వచ్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కొంత తగ్గింది. రజినీ చివరి సినిమా ‘అన్నాత్తె’ టైంకి అయితే పరిస్థితి దారుణంగా తయారైంది.
‘కబాలి’ లాంటి డిజాస్టర్‌తో కూడా పాతిక కోట్లకు పైగా షేర్ రాబట్టిన సూపర్ స్టార్.. ‘అన్నాత్తె’ తెలుగు వెర్షన్ ‘పెద్దన్న’తో అందులో పావు వంతు కూడా వసూళ్లు రాబట్టలేకపోయాడు. కానీ సూపర్ స్టార్ కొత్త చిత్రం ‘జైలర్’కు మాత్రం అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది. రెండు వారాల ముందు వరకు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. రిలీజ్ ముందు మాత్రం మంచి హైప్ వచ్చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రజినీ ఒకప్పటి క్రేజ్‌ను గుర్తు చేస్తూ ‘జైలర్’కు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా నడుస్తున్నాయి. చాలా షోలు ఫుల్ అయిపోయాయి. మిగతావి ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. ఇక తమిళ వెర్షన్‌కు క్రేజ్ అయితే మామూలుగా లేదు. తమిళనాట ఈ సినిమాకు తొలి రోజు ఎక్కడా టికెట్ ముక్క మిగిలేలా కనిపించడం లేదు. ‘జైలర్’ తమిళ వెర్షన్‌కు హైదరాబాద్‌లో సైతం పెద్ద ఎత్తున షోలు ఇచ్చారు. వాటికి రెస్పాన్స్ బాగుంది.
బెంగళూరు సిటీలో అయితే ‘జైలర్’ క్రేజ్ చూసి దిమ్మదిరిగిపోతోంది. ‘కబాలి’ రోజులను గుర్తు చేసేలా అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. సిటీలో మెజారిటీ థియేటర్లు ఈ సినిమాకే ఇచ్చేశారు. తమిళం, తెలుగు వెర్షన్లు మోత మోగించబోతున్నాయి. ఇక యుఎస్‌లో కూడా ‘జైలర్’ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. విడుదలకు రెండు రోజుల ముందు ఈ సినిమా 8 లక్షల డాలర్ల మార్కును దాటేసింది. ప్రిమియర్లతోనే ‘జైలర్’ మిలియన్ డాలర్ క్లబ్బులోకి అడుగు పెట్టబోతోంది.
This post was last modified on August 9, 2023 8:54 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…