హీరోల మీద ఫ్యానిజం చూపించుకోవడంలో అభిమానులు పలురకాలు. ఓపెన్ గా చెప్పాలంటే మన ఫ్యాన్స్ తమిళనాడు తరహాలో మరీ ఓవర్ గా ఉండరు. అప్పుడప్పుడు అల్లరి హద్దులు దాటినా మరీ విపరీతంగా అనిపించేవి ఎప్పుడూ చేయలేదు. పైపెచ్చు ఇతరులు సైతం ఆశ్చర్యపోయే, అసూయపడే అరుదైన పనులు చేస్తుంటారు. మహేష్ బాబు పుట్టినరోజుని పురస్కరించుకుని ఏకంగా ఆకాశంలోని ఒక నక్షత్రాన్ని అయన పేరు మీద రిజిస్టర్ చేయడం ద్వారా టాలీవుడ్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. తెలుగులో ఇలాంటి కానుక ఇప్పటిదాకా ఎవరూ ఇవ్వలేదన్నది వాస్తవం.
స్టార్ నేమింగ్ రిజిస్ట్రీ పేరుతో ఒక అంతర్జాతీయ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. మనకు ఏదైనా భూమి కొన్నప్పుడు ఎలా అయితే సర్వే నెంబర్, వివరాలు, దిక్కులు ఉంటాయో నక్షత్రాలకు అదే పద్దతిని ఫాలో అవుతున్నారు. మహేష్ కి ఇచ్చిన స్టార్ కు RA 12H 33M 295 తో ఒక సీరియల్ నెంబర్ ఇచ్చారు. DEC అనే కోడ్ తో పాటు దానికి సంబంధించిన యాంగిల్స్, మెజర్మెంట్స్ తో కూడిన వివరాలను కేటాయించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు మీద ఇది పర్మనెంట్ గా రాసిచ్చినట్టే. 16 నెంబర్లతో కూడిన రిజిస్ట్రేషన్ ధృవీకరణని ఇవాళ్టి డేట్ తో జారీ చేయించారు.
ఇకపై ఇదో కొత్త ట్రెండ్ గా మొదలైనా ఆశ్చర్యం లేదు. ఎవరు ఫాలో అయినా మొదట స్టార్ట్ చేసింది మహేష్ ఫ్యాన్స్ కాబట్టి ఆ క్రెడిట్ అలా నిలిచిపోతుంది. ఆన్ లైన్ లో డిపిలు మార్చడం, సినిమాలు షేర్ చేసుకోవడం, రీ రిలీజులను సెలెబ్రేట్ చేయడం, అన్నదానాలు నిర్వహించడం లాంటి ఎన్నో ప్రోగ్రాంలు చేస్తూనే మరో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సౌత్ లోనే ఇది మొదటిసారి కావడం గమనార్హం. బిజినెస్ మెన్ థియేటర్లను హౌస్ ఫుల్ బోర్డులతో మోతెక్కిస్తున్న ఫ్యాన్స్ తమ హీరోకు ఎప్పటికీ మర్చిపోలేని అరుదైన జ్ఞాపకాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు
This post was last modified on August 9, 2023 2:57 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…