ప్రతీ సినిమా నుండి దర్శక నిర్మాతలు ఏదో ఒక విషయం తెలుసుకుంటారు. ఇంకొన్ని నేర్చుకుంటారు. అయితే హిట్ సినిమాల నుండి ఎక్కువ నేర్చుకునే విషయలు ఉండకపోవచ్చు. కానీ భారీ నష్టం తీసుకొచ్చిన డిజాస్టర్ నుండి ఎంతో నేర్చుకోవచ్చు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ సినిమాతో అలాంటి ఓ ఖరీదైన పాఠాన్ని నేర్చుకున్నానని తెలిపాడు.
విషయం లోకి వెళ్తే , అఖిల్ -సురేందర్ రెడ్డి కాంబోలో అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజయ్యక నిర్మాత సోషల్ మీడియా ద్వారా బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్ళడం వళ్ళే ఈ తప్పు జరిగిందని ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అయితే ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టనని, తప్పంతా నాదే అంటూ చెప్పుకున్నాడు.
తాజాగా భోళా శంకర్ ప్రమోషన్స్ లో ఈ విషయంపై మళ్ళీ మాట్లాడాడు. ఏజెంట్ నేర్పిన పాఠం ఏమిటనే ప్రశ్నకి బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లకూడదని తెలుసుకున్నాని, ఇకపై అలాంటి పొరపాటు చేయనని, అందుకే నెక్స్ట్ సినిమాలను స్క్రిప్ట్ లేకుండా మొదలు పెట్టడం లేదని, పూర్తి కథ లేకుండా ప్రీ ప్రొడక్షన్ చేయవచ్చు కానీ షూటింగ్ చేయకూడదని డిసైడ్ అయ్యానని ఇకపై అదే పాటిస్తూ సినిమాలు నిర్మిస్తానని అన్నాడు.
నిజానికి అనిల్ సుంకర కి సోలోగా నిర్మించిన అన్నీ సినిమాలు బాగా నష్టాలు తెచ్చాయి. ఏజెంట్ మాత్రం కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ సినిమాతో బ్యానర్ బ్రాండ్ కి బాగా డ్యామేజ్ అయ్యింది. తాజాగా ఏజెంట్ తో నష్టపోయిన ఓ డిస్ట్రిబ్యూటర్ కూడా అనిల్ సుంకర మీద తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తూ భోళా శంకర్ రిలీజ్ పై వివాదం నెలకొల్పాడు. ఏదేమైనా కావాలని చేయకపోయినా ఏజెంట్ ఫలితం వల్ల అనిల్ సుంకర చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది.
This post was last modified on August 9, 2023 1:10 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…