సూపర్ స్టార్ మహేష్ కి క్లోజ్ గా ఉండే నిర్మాత ఎవరంటే టక్కున వినిపించే పేరు అనీల్ సుంకర. కృష్ణ గారి వీరాభిమానిగా మహేష్ కి దగ్గరైన అనిల్ సుంకర తన మిత్రులతో కలిసి సూపర్ స్టార్ తో దూకుడు , ఆగడు వంటి సినిమాలు నిర్మించాడు. మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా నిర్మించాడు. ఇక మహేష్ అప్ కమింగ్ మూవీస్ లిస్టులో కూడా అనిల్ సుంకర కి చోటుంది. తన సినిమాలకు సంబంధించి మహేష్ తో అప్పుడప్పుడు చెప్పుకుంటారు నిర్మాత. ఇదే క్రమంలో చిరంజీవి గారితో సినిమా చేస్తున్నానని చెప్పిన వెంటనే మహేష్ చెప్పిన ఓ విషయం తనకి బాగా హెల్ప్ అయ్యిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు అనిల్ సుంకర.
“సహజంగా నేను షూటింగ్స్ కి ఎక్కువ వెళ్ళను. అమెరికా టూ ఇండియా తిరిగే క్రమంలో షూటింగ్స్ కి వెళ్ళడం వీలు పడదు. కానీ మహేష్ తో సినిమా చేస్తే మాత్రం షూటింగ్ లో తప్పకుండా ఉంటాను. అలాగే భోళా శంకర్ షూటింగ్ కి కూడా ఎక్కువ సార్లు వెళ్ళాను. డానికి రీజన్. నాతో సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఉన్నావో అలాగే చిరంజీవి గారితో చేసేటప్పుడు సెట్స్ లో ఉండాలని మహేష్ చెప్పారు. చిరంజీవి గారికి నిర్మాత అలా ఉండటం చాలా ఇష్టమని తెలిపాడు. వాళ్ళకి వాళ్ళ గురించి బాగా తెలుసు కనుక మహేష్ చెప్పిన మాట నాకు చాలా హెల్ప్ అయ్యింది. నేను సెట్స్ లో ఉంటూ అన్నీ దగ్గరుండి చూసుకోవడం చిరంజీవి గారికి బాగా నచ్చింది” అంటూ అనిల్ చెప్పుకున్నారు.
“వేదాళం కన్నడ రీమేక్ రైట్స్ తన దగ్గర ఉన్నాయని , ఈ క్రమంలో మెహర్ రమేష్ తో ఆ విషయం చెప్తే నేను కూడా చిరంజీవి గారితో తెలుగులో అనుకున్నాను రెండేళ్ల క్రితం ఆయనతో ఆ రీమేక్ గురించి మాట్లాడాను అని అన్నాడు. ఆ తర్వాత తెలుగు రీమేక్ రైట్స్ ను ఏ ఎం రత్నం గారి దగ్గర నుండి తీసుకొని ముందు తెలుగులో రీమేక్ చేశాను. ఈ రీమేక్ ను చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లింది రమేష్ గారే. “అంటూ తెలిపాడు.
This post was last modified on August 9, 2023 12:55 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…