మెగాస్టార్ చిరంజీవి ఒక టైంలో నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టినట్లు కనిపించారు. కానీ అందులో కొన్ని పక్కకు వెళ్లిపోయాయి. వెంకీ కుడుములతో చేయాల్సిన ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. బింబిసార దర్శకుడు వశిష్ఠతో అనుకున్న సినిమా కూడా ముందుకు కదల్లేదు. చిరుతో సినిమా చేసే దర్శకులుగా ఇంకా ఇద్దరు ముగ్గురి పేర్లు వినిపించాయి. కానీ వారిలో కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమా మాత్రమే ఓకే అయినట్లు వార్తలొచ్చాయి.
దాని గురించి కూడా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఐతే ఇప్పుడు చిరు స్వయంగా ఆ ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇచ్చాడు. కళ్యాణ్ పేరు చెప్పకుండా తన కొత్త సినిమా గురించి ఖరారు చేశారు. ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుకలో చిరు మాట్లాడుతూ.. టాలీవుడ్లో చాలా స్పీడుగా సినిమాలు చేసుకుపోయే రవితేజ గురించి మాట్లాడారు.
రవితేజ ఈ మధ్య తనతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది తన నుంచి ఐదు రిలీజ్‌లు ఉంటాయని చెప్పాడని.. అతణ్ని చూసి తాను కూడా ఇన్‌స్పైర్ అయి వేగంగా సినిమాలు చేస్తున్నానని.. వచ్చే ఏడాది కనీసం తన నుంచి రెండు రిలీజ్‌లు ఉంటాయని చిరు చెప్పారు. అందులో ఒకటి తన కూతురు సుశ్మితకే చేస్తున్నట్లు చిరు వెల్లడించారు.
‘బ్రో డాడీ’కి రీమేక్‌గా చెప్పుకుంటున్న ఈ సినిమానే కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. దీని తర్వాత తాను యువి క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేయనున్నట్లు చిరు తెలిపారు. నిజానికి వెంకీ కుడుముల సినిమాను యువి వాళ్లే ప్రొడ్యూస్ చేయాల్సింది. మరి ఇప్పటికీ అతనే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడా.. లేక దర్శకుడు మారాడా అన్నది తెలియదు కానీ.. యువి సంస్థలో మాత్రం చిరు సినిమా కన్ఫమ్ అయింది. తాను ఇంకా కొందరు దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు కూడా చిరు వెల్లడించడం విశేషం.
This post was last modified on August 9, 2023 9:19 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…