నిన్నా మొన్నటి దాకా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడి బ్రాండ్ తోనే నెట్టుకుంటూ వచ్చిన ఆనంద్ కు బేబీ ఇచ్చిన బ్రేక్ చిన్నది కాదు. నా పిల్లరా అంటూ భగ్న ప్రేమికుడిగా తనిచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఇప్పటిదాకా చూడని మంచి నటుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. దెబ్బకు తన యాక్టింగ్ ని మార్కెట్ ని తక్కువంచనా వేసుకుంటూ వచ్చిన దర్శక నిర్మాతల నుంచి వరసగా ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. మీడియం బడ్జెట్ లో కంటెంట్ మీద ఆధారపడ్డ డైరెక్టర్లు తనను కలిసేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఒక్క హిట్టు పడితే సీన్ ఇలాగే ఉంటుంది ఎవరికైనా.
ఇక విషయానికి వస్తే బ్లాక్ బస్టర్ రన్ తో పాతిక రోజులు పూర్తి చేసుకున్న బేబీలో మొన్న ఆదివారం నుంచి ఒక పాట, కొన్ని సీన్లు జోడించారు. అప్పటికే యూత్ విపరీతంగా రిపీట్ రన్స్ లో సినిమా చూసేయడంతో మళ్ళీ కొత్తగా ఏముందబ్బా అని లైట్ తీసుకున్న వాళ్లే ఎక్కువ. అయితే కట్ చేసిన సాంగ్ లో ఆనంద్ దేవరకొండ సింగల్ టేక్ లో డాన్స్ చేసిన చందమామ చందమామ నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ అంటూ వీధి కుర్రాళ్లతో ఆడి పాడటం బాగా వచ్చింది. తనను మోసం చేసిన అమ్మాయిని ఉద్దేశించేలా సాహిత్యాన్ని పొందుపరిచారు. అయితే ఫస్ట్ వెర్షన్ లో లెన్త్ కోసం దీన్ని తీసేశారు
ఒకవేళ ముందే పెట్టి ఉంటే ఆనంద్ లో మంచి డాన్సర్ ఉన్న సంగతి జనానికి తెలిసేది. సరే ఇక్కడ ఎగిరిపోయినా ఎలాగూ ఆహా ఓటిటిలో ఫుల్ వెర్షన్ పెడతారు కాబట్టి అప్పుడు చూసుకోవచ్చు కానీ మొత్తానికి బిగ్ స్క్రీన్ మీద లక్షలాది ఆడియన్స్ మిస్ అయిన మాట వాస్తవం. వంద కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతున్న బేబీకి రెండు వారాల క్రితం బ్రో, ఇప్పుడు జైలర్, భోళా శంకర్ లు స్పీడ్ బ్రేకర్స్ లా నిలబడ్డాయి. అయినా కూడా మరీ తీవ్రంగా పడిపోకుండా వసూళ్లను మైంటైన్ చేస్తున్న బేబీ ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలవడం మాత్రం ఎవరూ ఊహించనిది.
This post was last modified on August 8, 2023 9:16 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…