ప్రస్తుతం బాలకృష్ణతో భగవంత్ కేసరి చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి దీనితో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ముందు చేసిన ఎఫ్2, ఎఫ్3 కామెడీ జానర్ కావడం, సరిలేరు నీకెవ్వరులో హాస్యం పాళ్ళు ఎక్కువ మోతాదులోనే ఉండటం వల్ల బాలయ్య మూవీతో టాప్ లీగ్ లోకి చేరతాననే నమ్మకంతో ఉన్నాడు. కళ్యాణ్ రామ్, రవితేజ, మహేష్ బాబు, వెంకటేష్, వరుణ్ తేజ్ ఇలా ఎవరితో చేసినా ఫ్లాప్ లేకుండా దూసుకుపోతున్న ఈ సూపర్ హిట్ దర్శకుడికి నెక్స్ట్ ప్రాజెక్టు లాక్ అయిపోయిందని తాజాగా అందిన సమాచారం.
ఎవరితోనో కాదండోయ్. ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ కొట్టేసినట్టుగా ఇన్ సైడ్ టాక్. ఎస్విసి బ్యానర్ పై దిల్ రాజు నిర్మించబోయే ఈ ఎంటర్ టైనర్ ని చంటబ్బాయి టైపులో మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతారట. కళ్యాణ్ కృష్ణది కూడా ఇదే తరహా అయినప్పటికీ అందులో ఎమోషన్స్ కి సమాన ప్రాధాన్యం ఉంటుంది. కానీ అనిల్ మూవీలో ఫక్తు రౌడీ అల్లుడు రేంజ్ మాస్ ని బయటికి తీస్తారని వినికిడి. ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉన్నప్పటికీ భగవంత్ కేసరి పనులన్నీ పూర్తయ్యాక అధికారిక ప్రకటన ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది.
భోళా శంకర్ తర్వాత చిరు చేయబోయే వాటిలో బింబిసార ఫేమ్ వశిష్ఠతో ప్యాన్ ఇండియా ఫాంటసీ మూవీ ఉంది. కానీ స్క్రిప్ట్ పనులు ఇంకా కొలిక్కి రాకపోవడంతో పాటు బడ్జెట్ కు సంబంధించిన విషయాలు ఫైనల్ చేయాల్సి ఉండటంతో కొంత లేట్ కావొచ్చని వినిపిస్తోంది. ఈ మూడు స్ట్రెయిట్ కథలే. రీమేక్ విషయంలో ఇప్పటికే బోలెడు కామెంట్స్ అందుకుంటున్న మెగాస్టార్ ఇకపై వాటికి స్వస్తి చెప్పాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇది మంచిది ప్లస్ అవసరం కూడా. ఆన్ లైన్లో దొరికే ఇతర బాషల సినిమాలను తీయడం కన్నా కొత్తవాటితో రిస్క్ చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి.
This post was last modified on August 8, 2023 9:04 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…
2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్‌కు…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అదికార కూటమి పూర్తిగా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. తనకు తానుగా ఏ…
టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చెప్పుకునే అర్జున్ రెడ్డికి సంగీత దర్శకుడు రధన్ ఇచ్చిన పాటలు ఎంత…
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలిగిపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ రోజు చాలా కీలకం. తెలుగులో కాకుండా…