ఒక సినిమా ఒక హీరోతో అనుకొని మరొక హీరోతో చేయడం చాలా సార్లు చూశాం. ‘భోళా శంకర్’ కూడా అదే కోవలోకి వస్తుంది. అజిత్ హీరోగా తమిళ్ లో వచ్చిన ‘వేదళం’ సినిమాను నిర్మాత ఏ ఎం రత్నం తెలుగులో పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేసుకున్నారు. తమిళ దర్శకుడు KT నేసన్ ను పెట్టుకొని సినిమాను లాంచ్ చేశారు. పవన్ కూడా ముహూర్తంలో పాల్గొన్నాడు. కానీ కట్ చేస్తే పవన్ వేదాళం వదిలేసి మరో రీమేక్ ప్లాన్ చేసుకున్నాడు.
అయితే ఈ రీమేక్ సినిమా తనకే రాసిపెట్టి ఉందని మెహర్ రమేష్ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయలేదు అనే రీజన్ తనకి తెలియదదు. కానీ చిరంజీవి గారితో ఈ రీమేక్ చేసి నేను కం బ్యాక్ అవ్వాలని ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ తో రత్నం గారు చేయాలని అనుకున్నా చేయలేకపోయారని చెప్పుకున్నాడు మెహర్. వేదాళంలో అన్నీ అంశాలు సమపాలల్లో ఉన్నాయి. హీరోయిజం, కామెడీ , సిస్టర్ సెంటిమెంట్ , ఇలా చాలా ఉన్నాయని , కథ కొందరికి తెలిసినా నా స్టైల్ లో ఈ సినిమా చేశానంటూ చెప్పుకున్నాడు మెహర్.
ఇక సినిమాలో సిస్టర్ కేరెక్టర్ కోసం ముందు నుండి కీర్తి సురేష్ నే అనుకున్నామని , ఆమెను కాంటాక్ట్ అవ్వడానికి నిర్మాత స్వప్న దత్ సహాయం తీసుకున్నాను, ఈ సందర్భంగా నేను సిస్టర్ గా భావించే స్వప్న కి థాంక్స్ చెప్పుకుంటున్నా, స్వప్న సిస్టర్ ద్వారా సినిమాలో కీర్తి సిస్టర్ వచ్చిందని తెలిపాడు. ఈ రీమేక్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు మెహర్. తనకి హిట్లు ఇచ్చిన రీమేక్ వర్క్ మళ్ళీ తనని ట్రాక్ లోకి తీసుకొస్తుందని నమ్ముతున్నాడు. మరి మెహర్ ఆశలు భోళా తీరుస్తుందేమో చూడాలి.
This post was last modified on August 8, 2023 6:18 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…