మనవైపు పోటీని సూపర్ స్టార్-మెగాస్టార్ మధ్యే చూస్తున్నాం కానీ బాలీవుడ్ లోనూ అచ్చం ఇలాంటి కాంపిటీషనే ఆగస్ట్ 11 నెలకొంది. గదర్ 2 ఊహించని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతుండటం చూసి ఓ మై గాడ్ 2 తెల్లబోతోంది. ఇప్పటిదాకా సన్నీ డియోల్ సినిమా 85 వేల టికెట్లు అమ్మేయగా ఇంకా రెండు రోజులు సమయం ఉంది కాబట్టి మొదటి షో పడేనాటికి లక్షన్నర సేల్స్ ఖాయమని బయ్యర్లు బల్లగుద్ది చెబుతున్నారు. అక్షయ్ కుమార్ బొమ్మ ఇంకా యాభై వేలు కూడా అమ్మలేదు. 65 సంవత్సరాల సన్నీకి ఇంత పెద్ద ఓపెనింగ్ వచ్చి దశాబ్దాలు గడిచిపోయింది.
మెయిన్ స్ట్రీమ్ నుంచి ఎప్పుడో పక్కకు తప్పుకున్న సన్నీ డియోల్ ఏదో పాత్ర నచ్చితే హీరోగా సినిమాలు చేస్తున్నారు కానీ ఏవీ పెద్దగా ఆడలేదు. అయితే ఇరవై సంవత్సరాల బ్లాక్ బస్టర్ గదర్ కు కొనసాగింపనగానే మాస్ ఆడియన్స్ లో ఎక్కడ లేని జోష్ వచ్చింది. ముఖ్యంగా అందులో పాకిస్థాన్ ని ఎండగట్టే డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్లు ఉండటంతో వాటి కోసం చూసేందుకు ఉత్సాహపడుతున్నారు. 1971 ప్రాంతంలో లాహోర్ లో జరిగిన కథగా గదర్ 2 ఉంటుంది. పెరిగి పెద్దయిన కొడుకు శత్రుదేశంలో చిక్కుకుపోతే అతన్ని విడిపించేందుకు తండ్రి చేసే పోరాటమే ఈ సీక్వెల్.
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని కంటెంట్ మీద మిశ్రమ స్పందన వచ్చినా వంద కోట్ల మార్కు సులభంగా దాటేసిన నేపథ్యంలో పక్కా మాస్ ఎలిమెంట్స్ ఉన్న గదర్ 2కి యావరేజ్ టాక్ వచ్చినా చాలు నార్త్ బాక్సాఫీస్ కు ఊపొస్తుంది. దీని వల్ల ఓ మై గాడ్ 2 దూకుడు ఏ మాత్రం లేకపోయింది. ఒకవేళ ముందు ప్రకటించినట్టు రన్బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగాల యానిమల్ కూడా ఇదే డేట్ కి వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అది వాయిదా పడటం సన్నీ, అక్షయ్ లకు పెద్ద ఊరట కలిగించింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన గదర్ 2 లోనూ అమీషా పటేలే హీరోయిన్ గా నటించింది.
This post was last modified on August 8, 2023 2:37 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…