Movie News

జస్ట్ 13 కోట్లు వస్తే చాలు హిట్టే

ఒకప్పటితో పోలిస్తే తెలుగులో రజనీకాంత్ మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. బాషా, నరసింహ టైంలో ఉదృతంగా, పోటీకి మన హీరోలు జంకే పరిస్థితి ఉండేది. కానీ వరస డిజాస్టర్లు మొత్తం సీన్ ని మార్చేశాయి. కాలా, కబాలిలు 30 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేస్తే  వాటి నష్టాలు బయ్యర్లను ఆ తర్వాత అంత పెట్టుబడి పెట్టేందుకు జంకేలా చేశాయి. పేటను పది కోట్లకే అమ్మినా బ్రేక్ ఈవెన్ చేరుకోలేకపోయింది. ఇక పెద్దన్న సంగతి సరేసరి. ఈ ప్రభావమంతా నేరుగా జైలర్ మీద పడింది. బయట ఎంత క్రేజ్ ఉన్నా తెలుగు వెర్షన్ ని మాత్రం ఏపీ తెలంగాణ కలిపి జస్ట్ 12 కోట్లకు విక్రయించారట.

జస్ట్ దీనికి ఇంకో కోటి అదనంగా వస్తే చాలు లాభాలే. ఈసారి రజనికు చాలా సానుకూలంగా మారుతున్న విషయం గురువారం రిలీజ్. బ్రో మూడు రోజుల హడావిడి తర్వాత థియేటర్లు సరైన ఫీడింగ్ లేక ఖాళీగా ఉన్నాయి. భోళాశంకర్ వచ్చేది ఫ్రైడే కాబట్టి ఒక్క రోజు గ్యాప్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని జైలర్ ని చిన్నా పెద్ద తేడా లేకుండా అత్యధిక స్క్రీన్లలో రేపు షోలు వేయబోతున్నారు. చిరుకి రిజర్వ్ చేసి పెట్టిన థియేటర్లలో తలైవర్ కి నాలుగైదు షోలు ఎల్లుండి పడిపోతాయి. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ఆపై భోళా శంకర్ రెస్పాన్స్ ని బట్టి పెంచడమో తగ్గించడమో బయ్యర్లు డిసైడ్ చేసుకుంటారు.

ఒకవేళ జైలర్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే ఈవెనింగ్, సెకండ్ షోలతోనే గరిష్టంగా రాబట్టుకోవచ్చు. ఏషియన్, సురేష్ సంస్థల పంపిణి కావడంతో అన్ని కేంద్రాల్లోనూ జైలర్ కు మంచి ప్లానింగ్ దొరికింది. ఓవర్సీస్ తర్వాత ముందుగా షోలు పడేది ఇక్కడే. తమిళనాడులో పలు కారణాల వల్ల ఉదయం 9 కన్నా ముందు ప్రీమియర్లు వేయడం లేదు. సో ఫస్ట్ రిపోర్ట్స్, రివ్యూస్ అన్నీ పక్క రాష్ట్రాల నుంచే అరవ ఫ్యాన్స్ తెలుసుకోబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ కు అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చగా దీన్నో యాక్షన్ కం రివెంజ్ థ్రిలర్ గా తీర్చిదిద్దారు. 

This post was last modified on August 8, 2023 2:31 pm

Share

Recent Posts

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

43 minutes ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

2 hours ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

3 hours ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

5 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

6 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

7 hours ago