ఒక సినిమాకు బజ్ రావడంతో సంగీతం పోషించే కీలక పాత్రను హీరోలు దర్శకులు సరిగా గుర్తించడం లేదు. ఒక్క పాట ఓపెనింగ్స్ ని తెస్తుందంటే వినడానికి వింతగా అనిపించినా ఇది ముమ్మాటికీ వాస్తవం. వర్తమాన పరిస్థితులను సరిగా విశ్లేషించుకుంటే ఇది సులభంగా అర్థమవుతుంది. బేబికి అంచనాల నిర్మాణంలో ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట మొదటి మెట్టుగా ఎంతగా ఉపయోగపడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తర్వాత వచ్చిన సాంగ్స్ మెల్లగా బిజినెస్ ని అమాంతం పెంచేశాయి. జైలర్ లో కావాలయ్యా కావాలయ్యా అంటూ తమన్నా చేసిన నృత్య భంగిమలు ఎంత వైరలయ్యాయో చెప్పనక్కర్లేదు.
ఇప్పుడే కాదు గతంలోనూ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గీత గోవిందంలో ఇంకేం ఇంకేం కావాలే, డీజే టిల్లులో టైటిల్ సాంగ్, హుషారులో ఉండిపోరాదే, ఎస్ఆర్ కళ్యాణమండపంలో చుక్కల చున్నీ, ధమాకాలో జింతక జింతక, వాల్తేరు వీరయ్యలో వేర్ ఈజ్ ది పార్టీ ఇలా అన్ని ఆల్బమ్స్ లో ఒక్కో పాట ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు భోళా శంకర్ సంగతి చూస్తే ఏ ఒక్క లిరికల్ వీడియో ఛార్ట్ బస్టర్ కాలేదు. మహతి స్వరసాగర్ ఇచ్చిన ట్యూన్స్ జనానికి పెద్దగా ఎక్కలేదని అర్థమైపోయింది. విజయ్ దేవరకొండ ఖుషికి హేశం అబ్దుల్ వహాబ్ పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ కి బాగా ఎక్కేశాయి.
ఇది జరగాలంటే కొత్త టాలెంట్ ని ప్రోత్సహించాలి. కావాల్సిన అవుట్ ఫుట్ కోసం మొహమాటం లేకుండా పిండుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇచ్చిందే బంగారంలా ఫీలయ్యే నేరుగా రికార్డింగ్ కు వెళ్ళిపోతే ఏ ప్రయోజనం ఉండదు. ఒకప్పుడంటే ఏడాదికి పధి సినిమాలు చేసిన ఇళయరాజా, మణిశర్మ, రెహమాన్ లాంటి వాళ్ళు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అందరికీ బెస్ట్ సాంగ్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడా పరిస్థితి లేదు. క్రియేటివిటీకి పదును పెరగాలంటే ఈ విభాగం మీద సీరియస్ గా దృష్టి పెట్టాలి. అయిదు నిమిషాల పాటే ఒక్కోసారి వంద కోట్ల మాయ చేస్తుంది.
This post was last modified on August 7, 2023 12:35 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…