ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ వాంటెడ్ మూవీస్‌లో ‘పుష్ప-2’ ఒకటి. 2021చివర్లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్టయిన ‘పుష్ప’ చిత్రానికి సుకుమార్ అండ్ టీం కొనసాగింపుగా తీస్తున్న సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే ‘పుష్ప-1’ రిలీజైన ఏడాదికే ఈ సినిమా కూడా రావాల్సింది. కానీ రెండేళ్ల తర్వాత కూడా ఇది వచ్చేలా లేదు.
షూట్ మొదలవడంలోనే చాలా ఆలస్యం అయింది. షూట్ మొదలయ్యాక కూడా అనుకున్నంత వేగంగా పని సాగట్లేదు. సుక్కు ఎప్పట్లాగే సన్నివేశాలను చెక్కుతూ ఉన్నాడని.. మధ్య మధ్యలో బ్రేక్స్ తప్పట్లేదని.. అందుకే రిలీజ్ కూడా చాలా ఆలస్యం అయ్యేలా ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య సినిమా నుంచి ఏ అప్‌డేట్ కూడా లేకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫీలైపోయి నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేశారు.
ఇదిలా ఉంటే ‘పుష్ప-2’ వచ్చే ఏడాది వేసవికి రిలీజైపోతుందంటూ ఒక ప్రచారం నడుస్తోంది. ఏప్రిల్లోనే విడుదల అంటూ డిస్కషన్లు కూడా పెట్టేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. కానీ చిత్ర వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే వేసవికి కూడా ‘పుష్ప-2’ రిలీజ్ కావడం సందేహమేనట. ఇప్పటిదాకా జరిగిన షూట్ 30 శాతమేనట.
ఈ ఏడాది చివరికి 60 శాతం షూటింగ్ అయితే గొప్ప అంటున్నాయి చిత్ర వర్గాలు. ఇంకా మేజర్ సీక్వెన్సులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. సుకుమార్ పర్ఫెక్షన్ కోసం ఎంత తపిస్తాడో అందరికీ తెలుసు. కాబట్టి వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ‘పుష్ప-2’ రిలీజయ్యే అవకాశాలు దాదాపు లేవని సమాచారం. వచ్చే దసరా టైంకి అయితే ఆశలు పెట్టుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న టీం పాటల పనిలో బిజీగా ఉంది. ట్యూన్స్ రెడీ చేసుకుని.. సాంగ్స్ షూట్‌కు ప్రణాళికలు రచిస్తున్నారట.
This post was last modified on August 6, 2023 11:06 pm
ఇటీవలే బాలకృష్ణ కల్ట్ మూవీ నారి నారి నడుమ మురారి టైటిల్ ని వాడేసుకున్న శర్వానంద్ తన మరో సినిమాకి…
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా నిన్న జాక్ టీజర్ విడుదల చేశారు. ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న…
నిన్న విడుదలైన తండేల్ కు పాజిటివ్ టాక్ రావడంలో దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు.…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…