ఒకరేమో తమిళ సూపర్ స్టార్ మరొకరేమో తెలుగు మెగాస్టార్. ఒక రోజు గ్యాప్ తో బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నప్పుడు యుద్ధం నువ్వా నేనా అన్నట్టు జరగాలి. కానీ ఓవర్సీస్ లో మాత్రం వార్ వన్ సైడ్ అన్నట్టు సాగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిగా తలైవర్ కు ఆధిపత్యం తెచ్చేలా జరుగుతున్నాయి. ఇంకో నాలుగు రోజులు ఉండగానే జైలర్ 5 లక్షల డాలర్లు అంటే అర మిలియన్ లాగేయగా భోళా శంకర్ కేవలం 1 లక్ష డాలర్లు దాటేసి మెల్లగా నడుస్తోంది. ప్రీమియర్లకు సంబంధించిన టైమింగ్స్, స్క్రీన్లు అన్నీ ముందస్తుగానే యుఎస్ డిస్ట్రిబ్యూటర్లు పక్కాగా ప్లాన్ చేసి సెట్ చేసుకున్నారు.
ఇక్కడ హైప్ కీలక పాత్ర పోషిస్తోంది. జైలర్ ట్రైలర్ వచ్చాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కావాలయ్యా సాంగ్ రీచ్ భీభత్సంగా వచ్చింది. తమన్నా స్టెప్పులు విపరీతంగా వైరలయ్యాయి. మిగిలిన సాంగ్స్ కూడా మ్యూజిక్ లవర్స్ ని నిరాశ పరచలేదు. కథ పరంగా మరీ కొత్తదనం అనిపించకపోయినా టేకింగ్ లో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చూపించిన వైవిధ్యం ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని పెంచింది. కానీ భోళా శంకర్ దీనికి రివర్స్ లో ఉంది. పాటలు, ట్రైలర్, పోస్టర్ వగైరాలన్నీ రొటీన్ అనే ఫీలింగ్ ఇవ్వడంతో పాటు ప్రమోషన్లు కూడా ఆశించినంత వేగంగా లేవు.
సీనియర్ హీరోలు కొత్త జెనరేషన్ ను ఆకట్టుకోవడం అంత సులభంగా లేదు. ఎప్పుడూ చూసే స్టఫ్ నే మళ్ళీ మళ్ళీ ఇస్తామంటే తిరస్కారం తప్పలేదు. ఇదే రజని పెద్దన్నను ఆడియన్స్ తిప్పి కొట్టారు. కానీ జైలర్ మీద ఆసక్తి చూపిస్తున్నారంటే దానికి కారణం కంటెంట్ లో క్రియేటివిటీనే. వాల్తేరు వీరయ్య లాగా భోళా శంకర్ కు టాక్ హెల్ప్ చేయాల్సిందే తప్పించి ఇప్పుడున్న బజ్ సరిపోదు. ఇవాళ జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏమైనా సర్ప్రైజులు, క్యాస్టింగ్ చెప్పే మాటలు కొత్తగా ఉంటే చెప్పలేం. ఇప్పటికైతే ఫారిన్ లో రజని డామినేషన్ వసూళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.
This post was last modified on August 6, 2023 5:14 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…