నందమూరి కళ్యాణ్ గత ఏడాది ‘బింబిసార’తో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. పెట్టుబడి మీద అందరికీ రెట్టింపు లాభాలు అందించింది ఈ చిత్రం. దీని తర్వాత ‘అమిగోస్’ మాత్రం ఈ నందమూరి హీరోకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కానీ ఆ ఫలితాన్ని పట్టించుకోకుండా తన తర్వాతి సినిమా మీదికి ఫోకస్‌ను మళ్లించాడు కళ్యాణ్ రామ్. అతడి నుంచి వస్తున్న మరో పెద్ద బడ్జెట్ సినిమా.. డెవిల్. బ్రిటిష్ కాలంలో సీక్రెట్ ఏజెంట్‌గా పని చేసిన ఒక వ్యక్తికి సంబంధించిన మిస్టీరియస్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
కొన్ని నెలల కిందటే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఆ తర్వాత ‘డెవిల్’ టీం నుంచి ఏ అప్‌డేట్ లేదు. రిలీజ్ ఊసు కూడా లేదు. ఐతే ఎట్టకేలకు మళ్లీ ‘డెవిల్’ వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ‘డెవిల్’ను నవంబరు 26న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఇక మిగిలిన టైంలో కాస్త పేరున్న ప్రతి చిత్రాన్నీ పండుగలు చూసుకునే రిలీజ్ చేస్తున్నారు. వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ సీజన్ల మీద దృష్టిపెట్టారు.
కానీ అందరూ ఇదే కోణంలో ఆలోచించడంతో ప్రతి సీజన్‌కూ బెర్తులు ఫుల్ అయిపోయాయి. పోటీ ఎక్కువైపోయింది. దీని వల్ల మళ్లీ డేట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి. కళ్యాణ్ రామ్ ఈ తలనొప్పులేమీ లేకుండా.. పండుగల జోలికి పోకుండా నవంబరు 26న సోలోగా తన సినిమాను రిలీజ్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. తర్వాత ఏదైనా సినిమా పోటీకి వస్తుందేమో తెలియదు కానీ.. నవంబరు చివరి వీకెండ్‌కు ఖరారైన సినిమా ఇదొక్కటే. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ డైరెక్షన్ టీం ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటం విశేషం. ముందు ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడిగా ఖరారయ్యాడు. కానీ తర్వాత ఈ ప్రాజెక్ట్ స్కేల్ దృష్ట్యా అతడికి ఒక టీంను ఇచ్చి డైరెక్షన్ క్రెడిట్ మొత్తం టీంకు ఇస్తున్నారు.
This post was last modified on August 6, 2023 3:09 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…