గత వారం విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’ వీకెండ్ వరకు మంచి జోరే చూపించింది. లో బజ్, డివైడ్ టాక్‌ను తట్టుకుని కూడా ఈ చిత్రం తొలి వీకెండ్లో రూ.100 కోట్లకు చేరువగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. కానీ వీకెండ్ తర్వాత ‘బ్రో’ వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. సోమవారానికి ఎలాంటి సినిమాకైనా డ్రాప్ మామూలే కానీ.. ‘బ్రో’ డ్రాప్ మాత్రం మరీ ఎక్కువగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు కంగారు పడిపోయారు. తర్వాత రెండు మూడు రోజుల్లో కూడా వసూళ్లు పెద్దగా పుంజుకోలేదు.
కానీ వీకెండ్లో ‘బ్రో’ బాక్సాఫీస్ రన్ ఆశాజనకంగానే సాగింది. ఈ వారం చెప్పుకోదగ్గ కొత్త రిలీజ్‌లు ఏవీ లేకపోవడం ఈ చిత్రానికి కలిసొచ్చింది. ‘బేబి’ సినిమాకు కూడా మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. శనివారం ‘బ్రో’కు కొన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి. సోమవారం కూడా బుకింగ్స్ పర్వాలేదు. ఐతే ‘బ్రో’ పట్ల ప్రేక్షకులను ఆకర్షించడానికి చిత్ర బృందమే పెద్దగా ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం లేదు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన గొడవ వల్ల ‘బ్రో’ గురించి మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయే తప్ప.. చిత్ర బృందం మాత్రం పబ్లిసిటీ మీద పెద్దగా దృష్టిపెట్టలేదు.
సాయిధరమ్ తేజ్ ఏదో కొంచెం కష్టపడి తిరుగుతున్నాడే తప్ప.. మిగతా టీం నుంచి స్పందన కరవైంది. పవన్ కళ్యాణ్ వచ్చి సినిమాను ప్రమోట్ చేయడని అందరికీ తెలుసు కానీ.. వేరే ప్రమోషనల్ ఈవెంట్లు ఏవైనా చేస్తే బాగుండేదని.. సోషల్ మీడియాలో, మీడియాలో కూడా పెద్దగా పబ్లిసిటీ చేయకుండా సినిమాను అలా వదిలిపెట్టేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘బేబి’ అనే చిన్న సినిమాను ప్రమోట్ చేసిన తీరు చూసి అయినా ‘బ్రో’ టీం కొంచెం పాఠాలు నేర్వాల్సింది. ఏదేమైనా ఈ వీకెండ్ తర్వాత ‘బ్రో’ నుంచి పెద్దగా షేర్ ఆశించడానికి లేదన్నది స్పష్టం. ఆదివారంతో రన్ దాదాపుగా పూర్తయినట్లే.
This post was last modified on August 6, 2023 11:15 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…