సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మీద మెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. తెలుగు మార్కెట్ లో తలైవర్ పెద్ద హిట్టు చూసి చాలా కాలమయ్యింది. పెద్దన్న మరీ దారుణంగా కనీసం బ్రేక్ ఈవెన్ లో సగం కూడా అందుకోలేక డిజాస్టర్ కొట్టింది. అయినా సరే అభిమానులు ఈసారి మాత్రం హిట్టు గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు. ట్రైలర్ లో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్ చూశాక ఏదో హాలీవుడ్ రేంజ్ లో ఉందని చాలా ఊహించుకుంటున్నారు. సరే అవి ఎంత వరకు నెరవేరతాయో ఇంకో నాలుగు రోజుల్లో తేలిపోతుంది కానీ కథకు సంబంధించిన కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
జైలర్ కథ పలు పాత బ్లాక్ బస్టర్ల మిక్స్చర్ పొట్లంలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. వాటి ప్రకారం గతాన్ని వదిలేసి మంచోడిగా భయస్తుడిగా నటించే ట్రాక్ ని బాషా నుంచి తీసుకున్నారు. దీనికి అసలు స్ఫూర్తి అమితాబ్ బచ్చన్ హమ్. అందులో బిగ్ బికి టైగర్ అనే మారు పేరు ఉంటుంది. ఇప్పుడీ జైలర్ లో దాన్నే వాడుకున్నారు. హఠాత్తుగా మారిపోయి మనుషులను చంపేసి తిరిగి అమాయకత్వం నటించడం అపరిచితుడు స్టైల్ లో ఉంటుందట. ప్రతి క్యారెక్టరైజేషన్ కు మూలం గతంలో చూసినట్టే ఉన్నా ఫ్రెష్ గా అనిపించేలా నెల్సన్ స్క్రీన్ ప్లేతో మేనేజ్ చేశాడని అంటున్నారు
అసలు పాయింట్ మరొకటి ఉంది. జైలర్ లో ఉన్న మూలకథని హాలీవుడ్ మూవీ నో బడీ నుంచి స్ఫూర్తి చెంది రాసుకున్నారట. అందులో ఎఫ్బిఐలో పని చేసి రిటైరైన హీరో కూతురితో ప్రశాంతంగా జీవితం గడుపుతాడు. కొందరు దొంగలు ఆ అమ్మాయి ప్రాణంగా చూసుకునే టెడ్డి బేర్ ని ఎత్తుకుపోతారు. వాళ్ళను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన హీరో ఊచకోతకు తెగబడతాడు. కాకపోతే జైలర్ లో బొమ్మని బదులు ఏకంగా రజని కొడుకునే మాయం చేసినట్టు చూపించబోతున్నారు. మరి ఇన్ని మిక్స్ చేసిన జైలర్ అంచనాలకు తగ్గట్టు ఉంటాడో లేదో 10న తేలిపోతుంది.
This post was last modified on August 5, 2023 3:44 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…