ఇంకో ఆరు రోజుల్లో విడుదల కాబోతున్న భోళా శంకర్ త్వరగానే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టుకుంది. హైదరాబాద్ లాంటి ప్రధాన కేంద్రాల ఆన్ లైన్ టికెట్స్ బుక్ మై షోలో పెట్టేశారు. మరీ హాట్ కేక్స్ లా కాదు కానీ క్రమంగా ఊపందుకునేలా ఉన్నాయి. అంచనాల విషయంలో కొంత వెనుకబడిన మాట వాస్తవం. రేపు సాయంత్రం శిల్పా కళావేదికలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హైప్ కి కొంత ఊపొస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా అతిథులు ఎవరూ ఉండకపోవచ్చని టాక్. రామ్ చరణ్ రావొచ్చనే ప్రచారం ఉంది కానీ చివరి నిమిషం దాకా చెప్పలేం.
ఇక కంటెంట్ విషయానికి వస్తే భోళా శంకర్ తమిళ హిట్ వేదాళం రీమేకన్న సంగతి సగటు ప్రేక్షకులకు తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ తో రొటీన్ మాఫియా రివెంజ్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. అయితే కీలకమైన విశ్రాంతి ఎపిసోడ్ ఒరిజినల్ వెర్షన్ సక్సెస్ లో చాలా కీలక పాత్ర పోషించింది. విదేశాల్లో ఉన్న విలన్ ని కవ్వించి ఇండియాకు వచ్చేలా చేసి, మొదటిసారి కలుసుకున్నప్పుడు ముందు అమాయకంగా నటించి తర్వాత క్రూరంగా నవ్వే సీన్ ని అజిత్ అద్భుతంగా పండించాడు. ఇప్పటికీ సోషల్ మీడియాలో దీని గురించి ప్రస్తావన తరచుగా వస్తూనే ఉంటుంది.
దీన్ని మెహర్ రమేష్ ఎలా రీ క్రియేట్ చేశాడు, చిరంజీవి ఎలాంటి ఎక్స్ ప్రెషన్లు ఇచ్చి పండించారనేది కీలకంగా మారనుంది. ఏ మాత్రం తేడా వచ్చినా ట్విట్టర్ లో పెద్ద ట్రోలింగ్ మెటీరియల్ అయిపోతుంది. గాడ్ ఫాదర్ టైంలో ఇలాగే పోలీస్ ఆఫీసర్ గుండెల మీద కాలు పెట్టే సన్నివేశం గురించి పెద్ద ఎత్తున ట్వీట్ల క్యాంపైన్ జరిగింది. కానీ ఇది అంతకన్నా క్లిష్టమైన ఎపిసోడ్. మరి మెహర్ చిరులు ఈ ఒక్క పోలికను విజయవంతంగా నెగ్గుకొస్తే మిగిలిన కమర్షియల్ మసాలా రొటీన్ గా ఉన్నా పాస్ అయిపోవచ్చు. మహతిస్వర సాగర్ నేపధ్య సంగీతం మీద కూడా పెద్ద బరువే ఉంది. చూద్దాం.
This post was last modified on August 5, 2023 1:29 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…