ఏ ముహూర్తంలో దర్శకుడు హను రాఘవపూడి కంట్లో పడిందో కానీ అక్కడ నుంచి మృణాల్ ఠాకూర్ దశ తిరిగిపోయింది. అప్పటిదాకా హిందీలో అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తూ బ్రేక్ ఎవరు ఇస్తారాని చూస్తున్న టైంలో సీతా రామం ఒక్కసారిగా తన జాతకాన్నే మార్చేసింది. మాములుగా గ్లామర్ షోకు ఎలాంటి మొహమాటం లేకుండా ఒప్పుకునే మృణాల్ చేతిలో ఇప్పుడు మంచి ఆఫర్లున్నాయి. ఆల్రెడీ న్యాచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న షూటింగ్ కీలక దశకు చేరుకుంది. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మూవీ చిత్రీకరణ ఆల్రెడీ మొదలైపోయింది.
ఇప్పుడీ లిస్టుతో పాటు తాజాగా తమిళ ఎంట్రీ కూడా ఖరారైపోయింది. శివ కార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ తీయబోయే భారీ చిత్రంలో మృణాల్ ఠాకూర్ నే హీరోయిన్ గా లాక్ చేసుకున్నారట. ఆమె ఓకే చెప్పిందని, ఇంకా రెగ్యులర్ షూట్ తాలూకు షెడ్యూల్స్ ని ప్లాన్ చేయలేదు కాబట్టి అది ఫిక్స్ అయ్యాక కాల్ షీట్లు లాక్ చేసుకుంటారు. చెన్నై టాక్ ప్రకారం ఈ ఏడాది చివర్లో దీనికి శ్రీకారం చుట్టబోతున్నారు. రజినీకాంత్ కు దర్బార్ రూపంలో ఫ్లాప్ ఇచ్చాక మురుగదాస్ మీద ఒత్తిడి పెరిగింది. చాలా టైం ఎదురుచూస్తే ఈ సినిమా సెట్ అయ్యింది.
సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మృణాల్ ఠాకూర్ తిరిగి ముంబై వెళ్లే అవసరం లేకుండానే ఇక్కడి హీరోలు దర్శకులు తనను బిజీగా మార్చేలా ఉన్నారు. హిందీ చిత్రాలు పూజా మేరీ జాన్, పిప్పా, ఆంఖ్ మిచోలిలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 ఇంటిమసీ సీన్లు చేసిన మృణాల్ యాక్టింగ్ తో పాటు అందాల ఆరబోతకు నో అబ్జెక్షన్ ఉంటుంది . అయితే సీతారామంలో హోమ్లీగా చూసిన కళ్ళతో మన దర్శకులు రచయితలు ఆమెకు అలాంటి నిండైన హుందాతనంతో కూడిన పాత్రలే ఇస్తున్నారు. ఇంకో రెండు మూడు హిట్లు పడితే నాలుగైదేళ్లు బిజీ అయిపోవచ్చు.
This post was last modified on August 5, 2023 12:01 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…