Movie News

బ్యాడ్ రివ్యూస్‌కి ‘భోళా’ టీం ప్రిపేరైపోయింది

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ విషయంలో మెగా అభిమానులే ముందు నుంచి అంత సంతృప్తిగా లేరన్నది వాస్తవం. ఈ రోజుల్లో రీమేక్ సినిమాలనగానే సగం ఆసక్తి చచ్చిపోతోంది. వాటి బిజినెస్, రెవెన్యూస్‌ కూడా అందుకు తగ్గట్లే ఉంటున్నాయి. అందులోనూ ‘వేదాలం’ లాంటి సగటు మాస్ సినిమాను చిరు రీమేక్ కోసం ఎంచుకోవడం.. పైగా శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు ఇచ్చి.. పదేళ్లుగా సినిమాలు తీయని మెహర్ రమేష్‌ చేతికి ఈ ప్రాజెక్టును అప్పగించడంతో ‘భోళా శంకర్’పై అంచనాలు మరింత తగ్గిపోయాయి.

ఈ సినిమా ప్రోమోలు కూడా అంతంతమాత్రంగానే కనిపించాయి. ఐతే ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ మెగాస్టార్ చరిష్మా, మాస్‌లో ఆయనకున్న ఆకర్షణ సినిమాను బాక్సాఫీస్ తీరం దాటించేస్తాయన్న ధీమాతో చిత్ర బృందం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నుంచి వస్తున్ సినిమా కావడం కూడా కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.

ఇక ‘భోళా శంకర్’కు ఎలాంటి టాక్ వస్తుంది.. రివ్యూలు ఎలా ఉంటాయనే విషయంలో ఎవరిలోనూ పెద్దగా ఉత్కంఠ లేదు. టీజర్, ట్రైలర్ చూసినపుడే చాలామందికి ఇదొక రొటీన్ మాస్ మసాలా సినిమా అనే విషయం అర్థమైపోయింది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాను క్రిటిక్స్ ఏ దృష్టితో చూస్తారో కూడా తెలుసు. అందుకే మెగా అభిమానుల్లోనే కొందరు.. రివ్యూలు ఎలా ఉంటాయో ముందే గెస్ చేసి పోస్టులు పెడుతున్నారు.

ఈ విషయంలో చిత్ర బృందానికి కూడా ఒక క్లారిటీ ఉంది. బ్లాక్‌బస్టర్ అయిన ‘వాల్తేరు వీరయ్య’కు కూడా తక్కువ రేటింగ్సే వచ్చాయి. అయినా సరే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. కాబట్టి ‘భోళా శంకర్’కు ఎలాంటి రివ్యూలు, రేటింగ్స్ వస్తాయనే విషయంలో టెన్షన్ ఏమీ లేదు. తక్కువ రేటింగ్సే వస్తాయని ముందే ప్రిపేరై.. మాస్‌ను థియేటర్ల వైపు ఆకర్షించేలా ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి మెగాస్టార్ మరోసారి క్రిటిక్స్ వేసే స్పీడ్ బ్రేకర్లను దాటి బాక్సాఫీస్ గమ్యాన్ని దాటుతాడేమో చూడాలి.

This post was last modified on August 4, 2023 7:18 pm

Share

Recent Posts

వాహ్ విజయ్… తడబడతాడనుకుంటే నిలబడ్డాడు!

తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…

16 minutes ago

అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…

2 hours ago

ఒంటరిగా యుద్ధ విమానం నడిపిన మహారాణి…

థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…

2 hours ago

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

3 hours ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

3 hours ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

4 hours ago