కపిల్ దేవ్ తర్వాత ఇండియాకు వరల్డ్ కప్ సాధించిన కెప్టెన్, మిస్టర్ కూల్ గా ఎంఎస్ ధోనికున్న పేరు ప్రఖ్యాతులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశ క్రికెట్ కు వన్నె తెచ్చిన ఆటగాడిగా, చెన్నై సూపర్ కింగ్స్ ని నడిపిస్తున్న రథసారధిగా ఇప్పటికీ తన ఫాలోయింగ్ చెక్కు చెదరలేదు. అలాంటి ధోని ప్రొడ్యూసర్ గా మారడమంటే ఆశ్చర్యమే. తన వెంచర్ లోని మొదటి సినిమా LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) ఇవాళ థియేటర్లలో రిలీజయ్యింది. తమిళ వెర్షన్ గత వారమే వచ్చినప్పటికీ ఇక్కడ బ్రో పోటీ వల్ల తెలుగు డబ్బింగ్ ని కొంత ఆలస్యంగా తీసుకొచ్చారు. ఇంతకీ బొమ్మ ఎలా ఉంది.
సాటి ఉద్యోగస్తులైన గౌతమ్(హరీష్ కళ్యాణ్), మీరా(ఇవానా) రెండేళ్లుగా ప్రేమించుకుంటారు. అమ్మ లీల(నదియా) అంగీకారం పొందిన గౌతమ్ కు ఊహించని విధంగా మీరా చిన్న షాక్ ఇస్తుంది. దాంతో ఫ్యామిలీ ట్రిప్ పేరుతో అత్తాకోడళ్ళు కలిసి ప్రయాణం చేస్తారు. అసలు మీరా తన ఫ్యామిలీలో ఏం చెప్పింది, ఎందుకు హఠాత్తుగా ఇలా రూటు మార్చి భర్త తల్లి గురించి తెలుసుకోవాలనుకుంటోందనే ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి. తీసుకున్న పాయింట్ వెరైటీగానే ఉన్నప్పటికీ దర్శకుడు రమేష్ తమిళమణి స్క్రీన్ ప్లే విషయంలో అరిగిపోయిన పాత ఫార్మాట్ నే వాడటం ఎల్జిఎంని దెబ్బ కొట్టింది.
మంచి ఫన్ తో నడవాల్సిన లవ్ స్టోరీ, మీరా-లీలల ఎపిసోడ్ బాగా ల్యాగ్ తో సీరియల్ టైపులో నడిపించడంతో సన్నివేశాలు విపరీతమైన నెమ్మదితనంతో విసిగిస్తాయి. ఎక్కడో ఒక చోట స్పీడ్ అందుకుంటుందని ఎదురు చూస్తుండగానే క్లైమాక్స్ వచ్చేస్తుంది. అప్పటిదాకా ఓపిగ్గా కూర్చుంటేనే. ఆర్టిస్టుల పరంగా ఎలాంటి వంకలు లేకపోయినా బ్యాడ్ రైటింగ్ వల్ల అవుట్ ఫుట్ తేడా కొట్టేసింది. అత్తకోడళ్ల డ్రామాని వెండితెరకు తగ్గట్టు మార్చే క్రమంలో టీవీ సీరియల్ పద్ధతిని ఫాలో కావడంతో ఎల్జిఎం రెండింటికి చెడ్డ రేవడి అయ్యింది. నిర్మాతగా తన డెబ్యూ మ్యాచ్ లో ధోని స్టంప్ అవుట్ అయినట్టే.
This post was last modified on August 4, 2023 12:57 pm
వైసీపీలో ఏం జరుగుతోంది? అంటే.. వినేవారు వింటున్నారు.. ఎవరి మానాన వారు ఉంటున్నారు. ఈ మాట ఎవరో కాదు.. జగన్కు…
జనాలు థియేటర్లకు రావడాన్ని తగ్గించడం వెనుక కారణం క్వాలిటీ కంటెంట్ లేకపోవడమే కావొచ్చు కానీ అంతకన్నా సీరియస్ గా చూడాల్సిన…
అమరావతి రాజధానికి కొత్తగా రెక్కలు తొడిగాయి. సీఎం చంద్రబాబు దూరదృష్టికి.. ఇప్పుడు ప్రపంచ స్థాయి పెట్టుబడి దారులు క్యూకట్టారు. ప్రధాన…
ఏ ముహూర్తంలో మొదలయ్యిందో కానీ మెగా ఫ్యాన్స్, అల్లు అభిమానుల మధ్య తరచు ఆన్ లైన్ గొడవలు జరగడం చూస్తూనే…
టాలీవుడ్ స్టార్ల అభిమానులు తమ హీరోతో జట్టు కడితే బాగుంటుందని ఎదురు చూస్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఖైదీతో తెలుగులోనూ…
ఈ ఏడాది ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడుని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. విడుదల…