భోళా శంకర్ తర్వాత చిరంజీవి ఎవరితో సినిమాలు చేస్తారనే విషయంలో ఎలాంటి డౌట్స్ లేవు. మొదటిది కల్యాణ కృష్ణ దర్శకత్వంలో కూతురు సుష్మిత కొణిదెల నిర్మాణంలో రూపొందబోయే ఎంటర్ టైనరనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇది మలయాళం హిట్ మూవీ బ్రో డాడీ రీమేకనే ప్రచారం నెల రోజులకు పైగా మీడియాలో నానుతూనే ఉంది. అభిమానులు ట్విట్టర్ వేదికగా వద్దని విన్నపాలు చేస్తూనే ఉన్నారు. తొలుత సిద్దు జొన్నలగడ్డను సెకండ్ లీడ్ గా తీసుకుని తర్వాత ఆ స్థానంలో శర్వానంద్ ని ఎంపిక చేశారనే టాక్ కూడా రెండు రోజులుగా తిరుగుతోంది.
ఇవన్నీ చూస్తూ ప్రస్తుతానికి టీమ్ సైలెంట్ గానే ఉంది. కథను అందించిన రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ బృందం అఫ్ ది రికార్డు మాట్లాడుతూ ఇది బ్రో డాడీ రీమేక్ కాదంటూనే వెయిట్ చేయమని కోరుతోంది. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ మా నాన్నకు పెళ్లి ఛాయల్లో ఫుల్ కామెడీగా ఉంటుందనే వార్త కూడా ఫిలింనగర్ వర్గాల్లో ఉంది. అయితే చిరుని తండ్రిగా చూపించకుండా అన్నయ్యగా మార్చి ఫ్యాన్స్ కి ఇబ్బంది లేకుండా సెట్ చేశారని వినికిడి. వీటికి చెక్ పడాలంటే ఆగస్ట్ 22న ఇచ్చే అనౌన్స్ మెంట్ లో క్యాస్టింగ్ తో పాటు ఇది దేనికీ రీమేక్ కాదనే క్లారిటీ ఇవ్వాలి.
ఇప్పటికీ రీ ఎంట్రీ తర్వాత చిరు మూడు రీమేకులు చేశారు. ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అయ్యింది. గాడ్ ఫాదర్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. విడుదలకు ముందే అంచనాల విషయంలో వెనుకబడిన భోళా శంకర్ ఫలితం ఇంకో పది రోజుల్లో తేలిపోతుంది. తిరిగి ఇంకో రీమేక్ అంటే సహజంగానే ఆసక్తి తగ్గుతుంది.బింబిసార ఫేమ్ వశిష్ఠతో పాటు తమిళ దర్శకుడు మిత్రన్ కు కమిట్ మెంట్స్ ఇచ్చిన చిరు వాటికి డేట్లు వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఇవ్వబోతున్నట్టు మెగా అప్డేట్. అఫీషియల్ గా వేటినీ ప్రకటించకపోయినా స్క్రిప్ట్ ల తాలూకు పనులలో ఆయా దర్శకులు బిజీగా ఉన్నారట.
This post was last modified on August 4, 2023 11:42 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…