ఈ వారం కొత్త సినిమాల మీద ప్రేక్షకులకు ఏమాత్రం ఆసక్తి కనిపించడం లేదు. ఏవేవో చిన్నా చితకా సినిమాలు రాబోతున్నాయి. దీంతో ప్రేక్షకుల దృష్టంతా తర్వాతి వారం సినిమాల మీదికి మళ్లింది. అందులో ముందుగా ప్రేక్షకులను పలకరించబోయేది సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘జైలర్’. ఆగస్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వారం ముందే ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర బృందం.
చాన్నాళ్ల తర్వాత రజినీ సినిమా కొంచెం కొత్తగా, ఆయన అభిమానులు కోరుకునేలా ఉండొచ్చనే సంకేతాలు కనిపించాయి ఈ ట్రైలర్ చూస్తే. ఇందులో రజినీ స్టైల్, సటిల్‌గా చెప్పిన మాస్ డైలాగులు ఈలలు వేయించేలాగే ఉన్నాయి. ‘కబాలి’ తర్వాత రజినీ ఇంత స్టైలిష్‌గా ఏ సినిమాలో కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. ‘జైలర్’ మాస్‌తో పాటు క్లాస్‌ను కూడా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ట్రైలర్ మొత్తం రజినీ స్వాగ్‌ను చూపిస్తూ సాగడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
కానీ ‘షోకేస్’ పేరుతో వచ్చిన ‘జైలర్’ ట్రైలర్లో హీరోయిన్ తమన్నా కనిపించకపోవడం ఆమె అభిమానులను నిరాశకు గురి చేసింది. ఈ సినిమాకు ముందు హైప్ రావడంలో తమన్నా పాత్ర కీలకం. ‘కావాలయ్యా’ పాటలో తమన్నా వేసిన స్టెప్పులు, తన గ్లామర్ సోషల్ మీడియాను ఈ పాట ఊపేయడానికి దోహదపడ్డాయి. షార్ట్స్, రీల్స్‌లో నెల రోజులుగా ఎక్కడ చూసినా ఇదే పాట కనిపిస్తోంది. ఆడియో వేడుకలో కూడా తమన్నా బాగా హైలైట్ అయింది.
కానీ హీరోయిన్ అయినప్పటికీ తమన్నాకు ట్రైలర్లో చోటు దక్కలేదు. లీడ్ హీరోయిన్ని చూపించకుండా ట్రైలర్ కట్ చేయడం అరుదు. ట్రైలర్లో మరీ ప్రాధాన్యం ఇవ్వకపోయినా.. కనీసం ఒకట్రెండు షాట్లు అయినా హీరోయిన్ కనిపించేలా చూడటం ధర్మం. మరెందుకో ‘జైలర్’ టీం ఆమెను పక్కన పెట్టేసింది. తమన్నానే కాదు.. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన మోహన్ లాల్‌ను సైతం ట్రైలర్లో చూపించలేదు. దీని వెనుక ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ ఉందేమో తెలియదు మరి.
This post was last modified on August 3, 2023 9:52 am
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…