అమాయకత్వం వెనుక అరాచకపు జైలర్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తోందంటే అభిమానులకు అదో తెలియని ఉద్వేగం. గత కొన్నేళ్లుగా ఆయన స్థాయి మూవీ రాలేదన్న కొరత వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ ఆశలన్నీ జైలర్ మీదే ఉన్నాయి. ఆగస్ట్ 10 భారీ ఎత్తున రిలీజ్ కు రంగం సిద్ధమయ్యింది. ట్రైలర్ ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలోనూ ఉంది. బీస్ట్ ఫ్లాప్ అయినా టేకింగ్ గురించి మంచి ప్రశంసలు అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజని పొగడ్తల వర్షం కురిపించారు. మరి రెండు నిమిషాల వీడియోలో కంటెంట్ గురించి ఏం చెప్పారు.

పోలీస్ ఆఫీసరైన కొడుకు, మనవడితో ప్రశాంతమైన జీవితం గడుపుతున్న ముత్తువేల్ పాండియన్ అలియాస్ పులి(రజనీకాంత్) ఎలాంటి గొడవలకి వెళ్లని ఓ సున్నిత మనస్కుడు. అయితే ఇతనికో విచిత్రమైన జబ్బు ఉంటుంది. హఠాత్తుగా రూపం మార్చుకుని అవతలి వాళ్ళు తప్పు చేశారని తెలిసిందో అక్కడిక్కడే నరికేస్తాడు. ఇలా స్ప్లిట్ పర్సనాలిటీతో ఉన్న టైగర్ జీవితంలో ఓ అలజడి మొదలవుతుంది. ఎక్కడో దూరంగా ఉన్న శత్రువు(జాకీ శ్రోఫ్) నుంచి ఆపద మళ్ళీ స్వాగతం పలుకుతుంది. దీంతో కత్తులు, కటార్లు, తుపాకులు పట్టుకుని దుర్మార్గుల సంహారానికి బయలుదేరతాడు. తన పూర్వాశ్రమ జైలర్ కరకుదనాన్ని బయటికి తీస్తాడు.

ఆద్యంతం రజని స్వాగ్ తో దర్శకుడు నెల్సన్ చాలా స్టయిలిష్ గా తలైవాని ప్రెజెంట్ చేశాడు. బాషా లాగా రెండు షేడ్స్ ఉన్నట్టు చూపించినా సీన్స్ లో డెప్త్, యాక్షన్ బ్లాక్స్ వల్ల రెగ్యులర్ కమర్షియల్ పంథాకు దూరంగా కొత్తగా ట్రై చేసిన ఫీలింగ్ ఇచ్చాడు. అనిరుద్ రవిచందర్ సంగీతం తనదైన బాణీలోనే గూస్ బంప్స్ బిజిఎం ఇచ్చింది. విజయ్ కార్తీక్ ఛాయాగ్రహణంలో చాలా క్వాలిటీ ఉంది. రమ్యకృష్ణ, సునీల్, యోగిబాబు, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన జైలర్ కు శివరాజ్ కుమార్, మోహన్ లాల్ క్యామియోలు ఆకర్షణగా నిలవబోతున్నాయి. మొత్తానికి జైలర్ అంచనాలు అమాంతం పెరిగాయి