ఒక సినిమా విషయంలో అధికార పార్టీ విపరీతంగా స్పందించడం ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలోనే జరుగుతుందనేది వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు ఆల్రెడీ నిరూపించాయి. ఇప్పుడు బ్రో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఒక మంత్రి ఏరియాల వారిగా కలెక్షన్లు, దానికి ఫైనల్ గా ఎంత గ్రాస్ వస్తుంది, డిజాస్టరవుతుందనే జోస్యం చెప్పడం ఇవన్నీ ఎక్కడా చూసుండం. ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చే రేంజ్ లో అంబటి రాంబాబు స్పందించడం చూస్తే బ్రోలో శ్యామ్ బాబు క్యారెక్టర్ కి ఆయన బాగా హర్ట్ అయినట్టు చిన్న పిల్లలకు సైతం సులభంగా అర్థమైపోయింది. ఇక బాధ్యతల విషయానికి వద్దాం.
కాకతాళీయంగా టి షర్ట్ ఒకటే మ్యాచ్ అయ్యిందని, అసలు తాము రాంబాబుని ఉద్దేశించి పృథ్వి పాత్రను పెట్టలేదని నిర్మాత ఎంత చెప్పినా సరే అసలు కథకు సంబంధమే లేని శ్యామ్ బాబు పేరుతో సహా అన్నీ అవే పోలికలతో కనిపించడం దాచి పెట్టలేం. సరే వాళ్ళు కావాలనే చేసినా ఇది అంత స్పందించాల్సిన విషయమే కాదు. అంబటి రాంబాబు మౌనంగా ఉంటే సరిపోయేది. అది వదిలేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ వసూళ్ల గురించి మాట్లాడ్డం సోషల్ మీడియాలో చులకనయ్యేందుకు అవకాశం ఇచ్చింది. ఇలాంటి పబ్లిసిటీ వల్ల ఆడే స్థితి పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎప్పుడూ రాకూడదు.
పొలిటికల్ అజెండాతో తీసి ఉంటే అది వేరే విషయం కానీ ఒక ఎమోషనల్ ఫాంటసీ పాయింట్ మీద రూపొందిన బ్రోలో కారణం ఏదైనా అవసరం లేని అంశాలకు చోటివ్వడం వల్లే ఇంత రాద్ధాంతానికి చోటిచ్చినట్టు అయ్యింది. అంబటి మాటలు, వాటికి కౌంటర్లతో జనసేన, వైసిపిలు బిజీగా ఉంటే మధ్యలో నెటిజెన్లు శుభ్రంగా టైం పాస్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా సక్సెస్ టూర్లో బిజీగా తిరుగుతున్నాడు.అతను బ్రో బాగుంది చూడమని పిలుపు ఇస్తుంటే మరోవైపు శ్యామ్ బాబు రగడ తప్ప బ్రోలో ఇంకేం లేదన్న రేంజ్ లో జరుగుతున్న రాంగ్ క్యాంపైన్ అసలు ఉద్దేశాన్ని దెబ్బ తీస్తోంది. అంత సులభంగా దీనికి చెక్ పడేలా లేదు.
This post was last modified on August 2, 2023 11:07 am
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…