సినిమా హీరోల కొడుకులు హీరోలు కావడం మామూలే. కానీ టెక్నీషియన్ల కొడుకులు తండ్రులను అనుసరించడం అరుదే. ఈ అరుదైన జాబితాలో మహతి స్వర సాగర్ ఉన్నాడు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తనయుడే ఈ మహతి. ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి చిత్రాలతో అతను సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు. ఐతే ఇప్పటిదాకా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే చేస్తూ వచ్చిన అతను.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’కు సంగీతం అందించాడు.
ఈ సినిమాలో భోళా మేనియా.. మిల్కీ బ్యూటీ పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ‘భోళా శంకర్’ ఇంకో పది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మహతి మీడియాను కలిశాడు. ఈ సందర్భంగా చిరుతో తన సంగీత ప్రయాణం గురించి ఆసక్తికర సంగతులు పంచుకున్నాడు. తాను చిరంజీవి పాటను రీమిక్స్ చేస్తే ఏది ఎంచుకుంటానో కూడా అతను వెల్లడించాడు.
‘‘మా నాన్న పుట్టిన రోజు నాడు చిరంజీవి గారి సినిమాకు సంగీతం అందించాలనే ప్రపోజల్ నా ముందుకు వచ్చింది. ముందు మెహర్ రమేష్ జోక్ చేస్తున్నారని అనుకున్నా. కానీ తర్వాత కథ చెప్పి సంగీతం చేయమన్నారు. ఈ అవకాశం నాకు ఎవరెస్ట్ ఎక్కినట్లు కాదు.. ఎవరెస్ట్‌ని తల మీద మోస్తున్నట్లు అనిపించింది. ‘భోళా శంకర్’కు నేను చేసిన ప్రతి ట్యూన్ సెట్‌కు వెళ్లి చిరంజీవి గారికి వినిపించేవాడిని. ఆయన తన ఆలోచనలను పంచుకుని నాకు మార్గ నిర్దేశం చేసేవారు. ముందు ‘భోళా మేనియా’ పాటను వినిపిస్తే.. ‘చెవుల తుప్పు వదిలిపోయిందయ్యా. మణిశర్మ రేంజ్ మాస్ కొట్టావు’ అన్నారు.
ఆ తర్వాత ఇంకో మాస్ పాట వినిపిస్తే.. ‘అన్నీ మాస్ పాటలే అవుతున్నాయి. మధ్యలో కొంచెం రిలీఫ్ ఉండాలి. మీ నాన్న ఇచ్చే ఆల్బం ఎంత మాస్‌గా ఉన్నా వాటిలో మెలోడి ఉంటుంది’ అంటూ ‘అన్నయ్య’ సినిమాలోని ‘హిమ సీమల్లో’ పాటను గుర్తు చేశారు. అప్పుడు ‘మిల్కీ బ్యూటీ’ పాట ట్యూన్ చేసి ఇచ్చా. అలా ఆయన సలహాలు నాకు ఉఫయోగపడ్డాయి. చిరంజీవి గారి పాట ఏదైనా రీమేక్ చేయాలంటే.. ‘రాధే గోవిందా’ చేస్తా. అది కూడా రామ్ చరణ్ సినిమాకైతేనే’’ అని మహతి పేర్కొన్నాడు.
This post was last modified on August 1, 2023 1:28 pm
2012 లో ఉప్పెన మూవీ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి..శ్యామ్ సింగరాయ్,. బంగార్రాజు చిత్రాలతో వరుస హిట్స్…
భారత పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా..…
ఒకవైపు దేశాన్ని మరోవైపు ప్రపంచ దేశాలను కూడా కుదిపేస్తున్న అంశం… ప్రముఖ వ్యాపార వేత్త.. ప్రపంచ కుబేరుడు.. గౌతం అదానీ…
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోన్న ఐపీఎల్-2025 ఆక్షన్ సందర్భంగా కొందరు క్రికెటర్లు కాసుల పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో మరికొందరు…
పుష్ప 1లో సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన…
కనివిని ఎరుగని జనసందోహం మధ్య బీహార్ లో జరిగిన ఈవెంట్ బ్లాక్ బస్టరయ్యాక పుష్ప 2 తాజాగా చెన్నైలో జరిపిన…