Movie News

Rgv.. నీకు కామన్ సెన్స్ ఉందా..?

1984 లో మద్రాస్ పామ్ గ్రోవ్ హోటల్..రూమ్ నంబర్ 305..కాలింగ్ బెల్ కొట్టాను..ఒక వ్యక్తి తెల్ల పైజామా..తెల్ల జబ్బా వేసుకుని లోపలినుండి తలుపు తీసాడు..దళసరిగా ఉన్న అద్దాలతో ఉన్న కళ్ళజోడు..నేను నా పేరు చెప్పి డైరెక్టర్ గారు రమ్మన్నారు అని పరిచయం చేసుకున్నాను..తను నేను రాము అని షేక్ హ్యాండ్ ఇచ్చి 5 మినిట్స్ కూర్చోండి అని ..నన్ను కూర్చోబెట్టి రూమ్ లోకి వెళ్ళాడు..

అది స్వీట్ రూమ్..ఈ లోగా నాకు ఆలోచనలు ..తరణి గారు చెప్పింది ఈ వ్యక్తి గురించేనా అనుకుంటున్నాను..నన్ను కో డైరెక్టర్ గా రమ్మని అక్కడ ప్రొడ్యూసర్ క్యాన్దిడేట్ రాము అని ఒకతను ఉంటాడు..ఇంగ్లీష్ మీడియం..మనకి సూట్ అవ్వడు..మన పని మనం చేసుకోవాల్సిందే అని కొంత బ్రీఫింగ్ ఇచ్చారు…..లోగడ తరణి గారు కో డైరెక్టర్ గా నేను అసిస్టెంట్ గా ‘ఇంటికో రుద్రమ్మ’..’బలిదానం’.. అనే సినిమాలు చేసాం..అసలు నేను ఆప్రన్టిస్ గా చేసిన ‘అమ్మాయి మొగుడు మామకు యముడు’ సినిమాకి ముగ్గురు అసోసియేట్స్ లో ఈయన ఒకరు..తర్వాత రాము బైటకు వచ్చాడు..ఇద్దరికి కలిసి బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేసి తెప్పించుకుని ముగించాం..

పక్క రూమ్ లో ఉన్న మల్లాది గారు రెడీ అయ్యి వచ్చారు..(మల్లాది గారు ఆ సినిమా కధా చర్చలలో పాల్గొనటానికి హైద్రాబాద్ నుండి వచ్చారు)….తరణి గారు కూడా వచ్చారు..అప్పటి వరకు వారు అనుకుంటున్న కధ నాకు చెప్పారు..’సౌండ్ ఆఫ్ మ్యూజిక్’.. ‘బిల్ కాస్ బి’ అనే బ్లాక్ ఆర్టిస్ట్ నటించిన టీవీ సీరీస్ లోంచి కొన్ని ఎపిసోడ్స్ తీసుకుని వండిన కధ అది.. తరణి గారు రాము కి మల్లాది గారికి నన్ను పరిచయం చేసి నా గురించి గొప్పగా చెప్పారు..

అలా పరిచయమైన రాము నేను బాగా క్లోజ్ గా మాట్లాడుకోవడం జరిగే క్రమంలో ‘తనలో సినిమా పట్ల కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి’ …అని నాకు…’నాకు సినిమా మేకింగ్ కి సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా వున్నదని’..రాము కు ఆర్ధమైంది.. ఒకరి పట్ల మరొకరికి సానుకూల దృక్పధం ఏర్పడింది..అప్పుడు రాము నన్ను అడిగిన ప్రశ్న..’అసలు దర్శకుడికి కావలసిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏమిటి’…నేను తడుముకోకుండా ఠక్కున చెప్పిన సమాధానం ‘కామన్ సెన్స్’…

ఆ మాట రామూ కి విపరీతంగా నచ్చింది..ఎందుకంటే అప్పటికి తనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోయినా కామన్ సెన్స్ పుష్కలంగా ఉంది…తర్వాత DV నరసరాజు గారు డైలాగులు రాయడం పూర్తి అయ్యి రావు గారిల్లు షూటింగ్ మొదలైంది….

— శివ నాగేశ్వర రావు

Satya

Recent Posts

తెప్ప త‌గ‌లేసిన త‌మ‌న్నా

కెరీర్ తొలి నాళ్ల‌లో పెద్ద‌గా అవ‌కాశాలు లేన‌పుడు ద‌క్షిణాదిన వ‌చ్చే ప్ర‌తి ఛాన్సునూ మ‌హా ప్ర‌సాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…

5 hours ago

పెద్ది ఈవెంట్ లో పవన్ హవా

మెగా హీరోల సినిమాల‌కు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్క‌డో ఒక చోట ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

7 hours ago

ఆర్సీ 17… చెప్పనన్న సుకుమార్

హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…

8 hours ago

చంద్రబాబు పవన్ పై మాట పడనివ్వరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…

9 hours ago

ఒక్క ఫొటో… అన్ని అనుమానాల‌కూ స‌మాధానం

ప్ర‌తి సంవ‌త్స‌రం విజ‌య్‌కి స్పెష‌ల్ పిక్‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పే త్రిష‌.. ఈసారి చెప్ప‌లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయ‌న్ని…

9 hours ago

ఆ ఇద్దరూ కలిసి సాధించారు!

నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…

10 hours ago