సినిమాలు ఎక్కువైపోవడంతో క్వాలిటీ దెబ్బ తింటోందని విమర్శలు ఎదురుకుంటున్న తమన్ ఇటీవలే బ్రో విషయంలోనూ పాటల పరంగా నిరాశ పరిచాడు. అయితే బ్యాక్ గ్రౌండ్ తో స్కోర్ పూర్తి నెగటివిటీ రాకుండా తప్పించుకున్నాడు. గుంటూరు కారం గురించి రకరకాల ప్రచారాలు ఊపందుకున్న నేపథ్యంలో ఇప్పుడు కేవలం దాని మీదే సీరియస్ ఫోకస్ పెట్టాడట. రోజు ఉదయం త్రివిక్రమ్ బృందంతో కలిసి నాలుగైదు గంటల పాటు నాన్ స్టాప్ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్టు సమాచారం. ఎప్పటికప్పుడు బాగున్నవి మహేష్ బాబు వాట్సాప్ కు వెళ్ళిపోయి ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటున్నాయట.
ఒక దశలో తమన్ ని తప్పించి హేశం అబ్దుల్ వహాబ్, భీమ్స్ సిసిరోలియోలను తీసుకునే ప్రతిపాదన కూడా మహేష్ ముందుకొచ్చింది. అయితే త్రివిక్రమ్, నాగ వంశీల మద్దతు సంపూర్ణంగా తమన్ కే ఉండటంతో ఆ గండం నుంచి తప్పించినట్టుగా వినికిడి. అలా జరిగితే ఇమేజ్ దెబ్బ తింటుంది కాబట్టి బాగా కష్టపడి అల వైకుంఠపురములోని మించిన ఆల్బమ్ ని ఇవ్వాల్సిందిగా స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది. అయిదు పాటలతో పాటు రెండు బిట్ సాంగ్స్ ని వీలైనంత త్వరగా సిద్ధం చేయాలి. మహేష్ ట్రిప్ నుంచి తిరిగి రాగానే ఆఘమేఘాల మీద షూట్ చేయాల్సి ఉంది.
కేవలం అయిదు నెలలే ఉన్న నేపథ్యంలో త్రివిక్రమ్, తమన్ ల మీద మాములు ఒత్తిడి లేదు. సంక్రాంతి సీజన్ ని వదులుకుంటే అభిమానుల నుంచే కాదు బయ్యర్ల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. ఒకవేళ తమన్ టైంకి మంచి పాటలు ఇచ్చి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదన్న కామెంట్స్ ని కొట్టి పారేయలేం. ఏది ఏమైనా తమన్ ఇప్పుడు రన్ రాజా రన్ అంటూ పరుగులు పెట్టాల్సిందే. దీని కోసమే పవన్ కళ్యాణ్ ఓజి పనులకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి గుంటూరు కారం మీదే ఉన్నాడు. ఆగస్ట్ 9న వచ్చే కొత్త పోస్టర్లో తన పేరు పెటేస్తే అన్ని డౌట్లన్నీ చెల్లాచెదురైపోతాయి.
This post was last modified on July 31, 2023 6:24 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…