ఏ సినిమా అయినా కొన్నేళ్ల తర్వాత చూసుకుంటే అందులో లోపాలు కనిపించడం.. ఇంకా బాగా చేసి ఉండాల్సిందేమో అని నటీనటులకు, టెక్నీషియన్లకు అనిపించడం మామూలే. వయసు, అనుభవం పెరిగే కొద్దీ చాలామందికి తమ పాత చిత్రాల్లోని లోపాలు బాగా తెలుస్తుంటాయి. కొన్ని సినిమాలు, పాత్రల విషయంలో రిగ్రెట్ అవుతుంటారు కూడా. మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా అలా రిగ్రెట్ అయ్యే సినిమా ఒకటి ఉందట. అదే.. సుర.
తమిళంలో టాప్ స్టార్ విజయ్ నటించిన చిత్రమిది. ఆయనతో తమన్నా నటించిన ఏకైక సినిమా ఇదే. అంత పెద్ద హీరో పక్కన చేసిన సినిమా తమన్నాకు చేదు అనుభవమే మిగిల్చింది. ఎస్.పి.రాజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ కెరీర్లో కూడా బిగ్గెస్ట్ ఫ్లాప్స్‌లో ఒకటిగా నిలిచింది. ఐతే మణిశర్మ అందించిన పాటలు మాత్రం సూపర్ హిట్. చాలా వరకు తెలుగు పాటల ట్యూన్సే ఇందులో వాడేశాడు మణి.
తమన్నా ఈ సినిమాలో అందంగా కనిపిస్తుంది కానీ.. తన పాత్ర, నటన తనకే నచ్చలేదట. ‘‘నాకు ఆ సినిమా కొన్ని రకాలుగా ఇప్పటికీ ఇష్టమే. ‘సుర’లో పాటలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. కానీ అందులో కొన్ని సన్నివేశాల్లో నా నటన నాకే నచ్చలేదు. షూటింగ్ సమయంలోనే కొన్ని సన్నివేశాలు సరిగా రాలేదని అనిపించింది.
కొన్ని సినిమాల విషయంలో షూట్ టైంలోనే ఏదో తేడా ఉందనే విషయం అర్థమైపోతుంది. కానీ ఒప్పుకున్నాం కాబట్టి పూర్తి చేయక తప్పదు. సినీ రంగం చాలా విలువైనది. ఇక్కడ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలి. అది మన వృత్తిలో భాగం’’ అని తమన్నా చెప్పింది. తమిళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన మిల్కీ బ్యూటీ.. మధ్యలో ఆ ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు రజినీకాంత్ సరసన ‘జైలర్’ మూవీతో తిరిగి తమిళ ప్రేక్షకులను పలకరిస్తోంది.
This post was last modified on July 31, 2023 4:04 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…