బాలీవుడ్లో ఒక దశలో హీరోలతో సమానంగా సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన కథానాయిక కంగనా రనౌత్. అలా ఒక స్థాయి అందుకున్నాక ఆమె ప్రవర్తన, మాటతీరు పూర్తిగా మారిపోయాయి. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కారుకు గట్టి మద్దతుదారుగా మారి రాజకీయ రంగు పులుముకున్నాక ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకో స్థాయికి వెళ్లిపోయాయి.
ఇక అప్పట్నుంచి బాలీవుడ్లో కొందరు ప్రముఖులను అదే పనిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది కంగనా. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కరణ్ జోహార్ గురించే. ఆయనతో ఆజన్మ శతృత్వం ఉన్నట్లుగా అదే పనిగా విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది కంగనా. ముఖ్యంగా కరణ్ తీసిన సినిమాలేవైనా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నాయంటే కంగనాకు పండుగ అన్నట్లే. తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలతో కరణ్ మీద విరుచుకుపడుతుంటుంది. ఆయన సినిమాలను ఎగతాళి చేస్తుంటుంది.
తాజాగా కరణ్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో కంగనా స్పందించింది. ‘‘ప్రేక్షకులను ఇక మోసం చేయలేరు. ఇలాంటి ఫేక్ సెట్స్, కాస్ట్యూమ్స్‌ను వాళ్లు అంగీకరించరు. నిజ జీవితంలో ఎవరైనా అలాంటి బట్టలు వేసుకుంటారా? 90వ దశకంలో తాను తెరకెక్కించిన సినిమాలనే కాపీ కొట్టి రూ.250 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా చేసినందుకు కరణ్ సిగ్గుపడాలి.
అంత బడ్జెట్ పెట్టి డైలీ సీరియల్ తీశారు. టాలెంట్ ఉన్న వాళ్లు ఆర్థిక వనరులు దొరక్క ఇబ్బంది పడుతుంటే.. ఇంత డబ్బు ఆయనకు ఎవరిచ్చారు? కరణ్.. ఇండస్ట్రీ ప్రస్తుతం ఉన్న పరిస్థఇతుల్లో డబ్బు వృథా చేయడం మానేసి రిటైరైపో. కొత్త టాలెంట్‌కు ఛాన్సులు కల్పించు. రణ్వీర్‌కు నేనిచ్చే సలహా ఒక్కటే. డ్రెస్సింగ్ విషయంలో దయచేసి కరణ్‌ను ఫాలో కావద్దు. సాధారణ వ్యక్తుల్లా బట్టలు వేసుకో. దక్షిణాది నటులు ఎంత హుందాగా దుస్తులు వేసుకుంటారో చూడు’’ అని కంగనా పేర్కొంది.
This post was last modified on July 30, 2023 5:15 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…