సూపర్ స్టార్ రజినీకాంత్ ఒప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలో మకుటం లేని మహారాజు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్‌లు, వసూళ్లు అన్నీ కూడా వేరే లెవెల్లో ఉండేవి. దక్షిణాదిన వేరే స్టార్ హీరోలెవ్వరూ కూడా ఆయన దరిదాపుల్లో ఉండేవారు కాదు. ‘రోబో’ సినిమాతో కెరీర్ పీక్స్‌ను అందుకున్న సూపర్ స్టార్ బాలీవుడ్ స్టార్లకు సైతం సవాలు విసిరారు. అలాంటి హై చూసిన ఆయన పదేళ్లు తిరిగేసరికి ఇబ్బందికర పరిస్థితికి చేరుకున్నారు.
‘అన్నాత్తె’ ఆయన కెరీర్లో అతి పెద్ద పతనంగా చెప్పవచ్చు. అంతకుముందు నుంచే వరుసగా డిజాస్టర్లు వస్తుండటంతో రజినీ మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. తమిళంతో పాటు తెలుగులో చాలామంది హీరోలు ఆయన్ని దాటి ముందుకు వెళ్లిపోయారు. రజినీ సినిమా వస్తోందంటే ఇంతకుముందున్న హైప్, యుఫోరియా ఇప్పుడు కనిపించడం లేదు.
కోలమావు కోకిల, డాక్టర్, బీస్ట్ చిత్రాలు రూపొందించిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’ సినిమా ప్రోమోలు, పాటలు ప్రామిసింగ్‌గా కనిపించినా కూడా రిలీజ్ ముంగిట అనుకున్నంత హైప్ అయితే కనిపించడం లేదు. తెలుగులో అయితే మరీ లో బజ్ ఉంది. రజినీ ట్రాక్ రికార్డు దెబ్బ తినడానికి తోడు నెల్సన్ చివరి సినిమా ‘బీస్ట్’ డిజాస్టర్ కావడంతో ‘జైలర్’పై తమిళంలో కూడా తక్కువ అంచనాలే ఉన్నాయి. కానీ రజినీతో పాటు టీం అంతా లో బజ్ విషయంలో ఏమాత్రం కంగార పడట్లేదట. ఆల్రెడీ ‘జైలర్’ సినిమాను ఇండస్ట్రీలో కొందరికి చూపించారట.
చిత్ర బృందంతో పాటు అందరూ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు సమాచారంం. రజినీ స్టైల్ అండ్ స్వాగ్ పీక్స్‌లో ఉండే సినిమా ఇదని.. ఫ్యాన్ మూమెంట్స్‌కు ఢోకా లేదని.. అనిరుధ్ పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయని.. కథాకథనాలు కూడా ఆసక్తికరంగా సాగి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని ‘జైలర్’ గురించి కోలీవుడ్ మీడియాలో ఇన్ సైడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ‘జైలర్’తో సూపర్ స్టార్ సైలెంట్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు. చూడాలి మరి నిజంగా ఆ అంచనాలు నిజమవుతాయేమో అని.
This post was last modified on July 30, 2023 9:42 am
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…